తెలుగు వాడైన జ‌స్టిస్ ర‌మ‌ణ‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు

మహారాష్ట్ర రాజకీయాలు ఒక్క రోజులోనే మలుపు తిరిగాయి.రెండోసారి సీఎం పీఠంపై కొనసాగాలని ఆశించిన దేవేంద్ర ఫడ్నవీస్‌ ఊహించని రీతిలో రాజీనామా చేయాల్సి వచ్చింది.

అంతకుముందు మద్దతిచ్చిన అజిత్‌ పవర్‌ సడెన్‌గా హ్యాండివ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చాలా మంది అనుకుంటున్నారు.కానీ అంతకంటే ముందే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పరిస్థితిని తారుమారు చేసింది.

Telugu Person Justice Ramana Give The Sensational Announcement

24 గంటల్లోనే బలపరీక్ష నిర్వహించాలన్నది ఆ తీర్పు సారాంశం.ఈ తీర్పు ఇచ్చింది మన తెలుగు వాడైన జస్టిస్‌ ఎన్వీ రమణ.రాజ్యాంగ దినోత్సవం నాడు అదే రాజ్యాంగాన్ని కాపాడేలా ఆయన ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది.రాత్రికి రాత్రి ఎలాంటి ఆధారం లేని ఓ లేఖను పట్టుకొని గవర్నర్‌ నడిపిన గేమ్‌కు ఈ తీర్పు చెక్‌ పెట్టింది.

సెలవు రోజైన ఆదివారంనాడు శివసేన వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా స్వీకరించిన రమణ.వెంటనే గవర్నర్‌, సీఎం ఫడ్నవీస్‌, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌లకు నోటీసులు జారీ చేశారు.సాధారణంగా ఇలాంటి కేసుల విషయంలో జడ్జీలపై రాజకీయ ఒత్తిళ్లు సహజం.

Advertisement
Telugu Person Justice Ramana Give The Sensational Announcement-తెలుగ�

కానీ మహారాష్ట్ర తీర్పు విషయంలో రమణ పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తూ బీజేపీకి షాకిచ్చారు.

Telugu Person Justice Ramana Give The Sensational Announcement

2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన రమణ.ఇప్పటికే పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు.జమ్ముకశ్మీర్‌ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విచారణ జరిపిన సమయంలోనూ.

రమణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోక తప్పదని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియారిటీ పరంగా రమణ రెండోస్థానంలో ఉన్నారు.ఈ లెక్కన ప్రస్తుతం సీజేఐగా ఉన్న బోబ్డే 2021లో రిటైరైన తర్వాత ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను రమణనే చేపట్టబోతున్నారు.

ఫోర్బ్స్ జాబితా ...రష్మిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా... బాగానే వెనకేసిన నటి!
Advertisement

తాజా వార్తలు