తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -Telugu NRI America News

1.జగిత్యాల లో గల్ఫ్ జేఏసీ సభ్యుల ఆత్మీయ సమావేశం

గల్ఫ్ జేఏసీ సభ్యుల ఆత్మీయ సమావేశం సోమవారం జగిత్యాల లోని శివ సాయి హోటల్ లో జరిగింది.

ఈ సమావేశానికి గల్ఫ్ జేఏసి కన్వీనర్ గుగ్గిళ్ళ రవి గౌడ్ అధ్యక్షత వహించారు. 

2.కువైట్ లో తొమ్మిది రోజులు సెలవులు

 గల్ఫ్ దేశం కువైత్ ఈద్ అల్ అదా (బక్రీద్ ) సందర్భంగా 9 రోజులు సెలవులు ప్రకటించింది.జూలై 10 నుంచి జూలై 14 వరకు అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలకు సెలవులు ఉంటాయని కువైట్ మంత్రి మండలి వెల్లడించింది. 

3.సౌదీ అరేబియా వెళ్లే వారికి గుడ్ న్యూస్

 

కరోనా కట్టడి కోసం విధించిన అన్ని ఆంక్షలను తొలగిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం వెల్లడించింది. 

4.స్వదేశానికి వస్తూ విమానంలోనే మృతి చెందిన భారత ప్రవాసుడు

  షార్జా నుంచి మూడేళ్ల తరువాత స్వదేశానికి వస్తున్న కేరళకు చెందిన 40 ఏళ్ల మహ్మద్ ఫైజల్ అనే వ్యక్తి షార్జా నుంచి కోజికొట్ వస్తుండగా విమానంలోనే మృతి చెందాడు. 

5.కువైట్ లోని ప్రవాసులకు ముఖ్య గమనిక

 

కువైట్ లోని భారత ఎంబసీ బుధవారం (జూన్ 15 ) న ఓపెన్ హౌస్ మీటింగ్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. 

6.అమెరికా హెల్త్ సెక్రటరికి కరోనా

  అమెరికా లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.తాజాగా ఆ దేశ హెల్త్ సెక్రటరీ జేవియార్ బెకర్రా కరోనా బారిన పడ్డారు. 

7.పౌరులకు ఇజ్రాయిల్ కీలక సూచన

 

Advertisement

 ఇస్తాంబుల్ లో ఉన్న ఇజ్రాయిల్ పౌరులు వెంటనే ఆ దేశాన్ని విడిచి స్వదేశానికి రావాలని ఇజ్రాయిల్ విదేశాంగ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. 

8.నుపూర్ శర్మ వ్యాఖ్యలపై కువైట్ లో నిరసనలు.

ప్రభుత్వం కీలక నిర్ణయం

 మహమ్మద్ ప్రవక్త గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ వ్యాఖ్యలపై కువైట్ లో కొంతమంది నిరసనకు దిగారు.ఆ నిరసనలో ఉపడి నిమిత్తం వివిధ దేశాల నుంచి వచ్చిన వారిని  గుర్తించి వారిని ఆయా దేశాలకు పంపించి వేయలని కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది.

 .

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు