పంతానికి పోయి కోట్లు నష్టపోతున్న నిర్మాతలు

కరోనా కారణంగా ఎక్కువగా నష్టపోతున్నది నిర్మాతలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఎందుకంటే నిర్మాతలు ఇప్పటికే కొన్ని సినిమాల మీద కోట్లు పెట్టి ఉన్నారు.

కొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.ఆ సినిమాల మీద అప్పు తెచ్చి కొందరు పెట్టుబడి పెట్టి ఉంటారు.

కొందరు తమ వద్ద ఉన్న డబ్బులను పెట్టుబడి పెట్టి ఉన్నారు.ఆ డబ్బులు అయిదు ఆరు నెలలుగా వృదాగా ఉన్నాయి.

అంటే కోట్లల్లో వడ్డీ లాస్‌ అంటున్నారు.ఈ సమయంలో కొన్ని సినిమాలకు ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి.

Advertisement
Telugu Film Producers Not Interested With Ott, Theaters Release, Lockdown, OTT,

నిర్మాతలు పలువురు తమ సినిమాలు ఓటీటీలోనే రావాలనే పట్టుదలతో ఓటీటీ మంచి ఆఫర్లను కూడా తిరష్కరిస్తున్నారు.థియేటర్లలో విడుదల చేస్తే అంత వస్తుందా రాదా అనే అనుమానం ఉన్నా కూడా థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు పంతానికి పోతున్నారు.

ఇలా పోవడం వల్ల వారికి కోట్లల్లో నష్టం వాట్లిుతుంది.అయినా కూడా దాన్ని వారు పట్టించుకోవడం లేదు.

మొన్నటి వరకు దిల్‌ రాజు కూడా అలాగే ఉండేవాడు.కాని ‘వి’ సినిమా విషయంలో ఆయన ఆర్థికంగా చాలా నష్టపోతున్నాడు.

Telugu Film Producers Not Interested With Ott, Theaters Release, Lockdown, Ott,

థియేటర్లు ఓపెన్‌కు ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్న కారణంగా ‘వి’ సినిమాను అమెజాన్‌లో విడుదల చేసి తన వడ్డీ భారంను తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.ఈ పరిస్థితుల్లో కూడా కొందరు నిర్మాతలు పంతానికి పోతున్నారు.వచ్చే నెలలో థియేటర్లు ఓపెన్‌ అయ్యే అవకాశం ఉంది.

అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
మార్చి, ఏప్రిల్ నెలల్లో పెద్ద సినిమాల రిలీజ్ లేనట్టేనా.. ఆ సినిమాల వల్లే ఈ పరిస్థితా?

కనుక అప్పటి వరకు వెయిట్‌ చేద్దామని అనుకుంటున్నారు.ఇలా రెండు మూడు నెలుగా నెట్టుకు వస్తున్న నిర్మాతలు ఇకపై అయినా మేలుకుని తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు