తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి12, బుధవారం2025

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.46

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.17

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఆశ్లేష మంచిది కాదు.

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.36 మ.1.34

మేషం:

ఈరోజు నిరుద్యోగ యత్నాలు కలిసిరావు.చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

బంధు మిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది.గృహనిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తి కావు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి16, ఆదివారం 2025
రామ్ చరణ్ ఆ దర్శకుడిని నెగ్లేట్ చేశాడా..?

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Advertisement

వృషభం:

ఈరోజు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

గృహంలో చికాకులు పెరుగుతాయి.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి.

మిథునం:

ఈరోజు కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు.బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి.పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది.దూర ప్రయాణాలు లాభిస్తాయి.

వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.సోదరుల సహాయంతో వివాదాల నుండి బయట పడతారు.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి.

ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది.

సింహం:

ఈరోజు మీకు కొన్ని విషయాలు అనుకూలంగా ఉండవు.విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.అనుకోకుండా కొన్ని విజయాలు దక్కుతాయి.

కొన్ని సంతోషకరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.అనవసరమైన గొడవలకు వెళ్లకపోవడం మంచిది.

కన్య:

ఈరోజు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.

వృత్తి ఉద్యోగాలలో నూతన విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారాలలో అంచనాలు అందుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలమౌతాయి.

తుల:

ఈరోజు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.

నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది.

వృశ్చికం:

ఈరోజు ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు.దూరపు బంధుమిత్రుల రాకతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది.

సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి.ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

ధనుస్సు:

ఈరోజు ఆర్థిక పురోగతి సాధిస్తారు.నిరుద్యోగ యత్నాలు సానుకూల ఫలితాన్నిస్తాయి.సంఘంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది.

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.వ్యాపారములలో స్వంతనిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

మకరం:

ఈరోజు ఆలయ సందర్శన చేసుకొంటారు.సంతాన విషయంలో ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు.ఋణదాతల ఒత్తిడి అధికమై మానసిక బాధలు ఎదుర్కొంటారు.

దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.స్థిరాస్తి వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తి అవుతాయి.

కుంభం:

ఈరోజు సమయానికి తగిన ధన సహాయం అందుతుంది.వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.ఆరోగ్యం కుదుటపడుతుంది.

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు అధికారుల నుండి మన్నలను అందుకుంటారు.

మీనం:

ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు.నిరుద్యోగులకు ఉత్సాహంగా సాగుతుంది.

విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.సంతానం విషయాలు సంతృప్తినిస్తాయి.

తాజా వార్తలు