సాధారణంగా ఉద్యోగాలంటే బస్సులోనో, కారులోనో, రైల్లోనో వెళ్తారు.కానీ మలేషియాలో( Malaysia ) భారతీయ సంతతికి చెందిన రాచెల్ కౌర్( Rachel Kaur ) అనే మహిళ మాత్రం రోజూ విమానంలో ఆఫీస్‌కి వెళ్తున్నారు.
ఇది తెలుసుకుని అందరూ నోరెళ్లబెడుతున్నారు.ఇద్దరు పిల్లల తల్లి అయిన రాచెల్ కౌర్ ఎయిర్ ఏషియాలో( Air Asia ) ఫైనాన్స్ ఆపరేషన్స్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
కౌలాలంపూర్‌లో( Kuala Lumpur ) ఆఫీసు దగ్గర ఉండకుండా, పెనాంగ్ నుండి ఫ్లైట్‌లో వెళ్లడానికే ఆమె ఇష్టపడుతున్నారు.ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.
ఇది ఆమెకి చాలా ఈజీగా ఉండటమే కాకుండా, సిటీలో అద్దెకు ఉండటం కంటే కూడా తక్కువ ఖర్చు అవుతుందట.
అసలు ఇంతకుముందు రాచెల్ కౌలాలంపూర్‌లోనే ఉండేవారట.
వారానికి ఒక్కసారి మాత్రమే పెనాంగ్‌లో( Penang ) ఉన్న తన కుటుంబాన్ని చూడ్డానికి వెళ్లేవారు.కానీ పిల్లల్ని వదిలి ఉండలేక చాలా ఇబ్బంది పడ్డారు.
దాంతో 2024 ప్రారంభంలో తన రూటీన్ మార్చుకుని, రోజూ ఫ్లైట్‌లో ఆఫీస్‌కి వెళ్లడం మొదలుపెట్టారు.ఇప్పుడు పిల్లలతో ఎక్కువ టైమ్ గడుపుతూనే ఉద్యోగం చేస్తున్నారు.

ఆమె రోజు ఉదయం 4 గంటలకే నిద్రలేస్తారు.రెడీ అయ్యి 5 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి పెనాంగ్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తారు.ఉదయం 6:30 గంటలకు కౌలాలంపూర్‌కి ఫ్లైట్ ఎక్కుతారు.7:45కి ఆఫీస్‌కి చేరుకుని రోజంతా పనిచేస్తారు.సాయంత్రం మళ్లీ ఫ్లైట్‌లో తిరుగు ప్రయాణమై రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకుంటారు.
రోజూ దాదాపు 700 కి.మీ ప్రయాణం చేసినా ఆమె ఖర్చులు మాత్రం బాగా తగ్గిపోయాయట.ఇంతకుముందు కౌలాలంపూర్‌లో అద్దె, ఇతర ఖర్చుల కోసం నెలకు దాదాపు 474 డాలర్లు (రూ.41,000) ఖర్చు చేసేవారు.కానీ ఇప్పుడు ఫ్లైట్ టికెట్ల కోసం కేవలం 316 డాలర్లు (రూ.27,000) మాత్రమే ఖర్చు చేస్తున్నారు.అంటే నెలకు వేలకు వేలు ఆదా చేసుకుంటున్నారు.

ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నంతసేపు ఆమెకు “మీ టైమ్” దొరుకుతుందట.పాటలు వింటూ, ఆకాశాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తారు.ఎయిర్‌పోర్ట్‌లో దిగాక కొంచెం దూరం నడుచుకుంటూ ఆఫీస్‌కి వెళ్తారు.ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కంటే ఆఫీస్‌కి వెళ్లడానికే ఆమె ఎక్కువ ఇష్టపడతారు.ఎందుకంటే డైరెక్ట్‌గా అందరితో మాట్లాడితే పనులు ఈజీగా అయిపోతాయట.రాచెల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎయిర్ ఏషియా సంస్థ కూడా సపోర్ట్ చేస్తోంది.
ఉదయాన్నే లేవడం కాస్త కష్టంగా ఉన్నా, రాత్రికి తన పిల్లల్ని చూస్తే ఆ కష్టం అంతా మర్చిపోతానని రాచెల్ అంటున్నారు.చాలామంది ఆమెను “పిచ్చిది” అంటున్నా, ఉద్యోగం, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆమె మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు.
https://youtu.be/eqY-6liSedw?si=GN0oY7XiX2WqwHdS ఈ లింకు మీద క్లిక్ చేసి ఆమె లేటెస్ట్ వీడియోను చూడవచ్చు.