వాలెంటైన్స్ వీక్‌లో సింగిల్స్‌కి అదిరిపోయే ఆఫర్.. రూ.100కే గర్ల్‌ఫ్రెండ్స్‌.. బాయ్‌ఫ్రెండ్స్‌..!

వాలెంటైన్స్ వీక్( Valentines Week ) ఆల్రెడీ ప్రారంభమైపోయింది, ప్రేమికుల రోజు కూడా దగ్గర పడుతోంది.లవ్ బర్డ్స్ అంతా గిఫ్టులు, డేట్లు, సర్ ప్రైజ్‌లతో రెచ్చిపోతుంటే, సింగిల్స్‌కి( Singles ) మాత్రం గుండెల్లో బాధ పెరిగిపోతోంది.

 No Valentine No Problem Just Rent A Boyfriend Or Girlfriend On February 14 Detai-TeluguStop.com

చుట్టూ జంటల్ని చూస్తుంటే ఒంటరితనం మరింత ఎక్కువవుతుంది.ఐతే కొన్ని దేశాల్లో సింగిల్ పర్సన్స్ కోసం ఒక అదిరిపోయే సొల్యూషన్‌ని కనిపెట్టారు.

అదేంటంటే, గర్ల్‌ఫ్రెండ్( Girlfriend ) లేదా బాయ్‌ఫ్రెండ్‌ని( Boyfriend ) అద్దెకు ఇవ్వడం ప్రారంభించారు.కొన్ని గంటలో, రోజంతా మీతో గడిపేందుకు టెంపరరీ పార్ట్‌నర్స్( Temporary Partners ) దొరుకుతారు.

ఈ ట్రెండ్ చైనా, జపాన్, వియత్నాంలో బాగా పాపులర్ అవుతోంది.

ఈ వింత ట్రెండ్ 2018లో చైనాలో( China ) మొదలైంది.షాపింగ్ మాల్స్‌లో ఒక కొత్త సర్వీస్ స్టార్ట్ చేశారు.20 నిమిషాల పాటు కబుర్లు చెప్పేందుకు ఒక పార్ట్‌నర్‌ని అద్దెకు తీసుకోవచ్చు.రేటు ఎంతంటే జస్ట్ 10 యువాన్లు (దాదాపు రూ.100).కానీ కొన్ని రూల్స్ ఉండేవి.వాళ్లతో మాట్లాడొచ్చు కానీ మాల్ బయటికి తీసుకెళ్లకూడదు.అయినా ఈ ట్రెండ్ ఊపందుకుంది.ఇప్పుడు కేవలం కబుర్లే కాదు.

భోజనం చేయడం, షికార్లు కొట్టడం, షాపింగ్‌కి వెళ్లడం ఇలా చాలా రకాల పనుల కోసం పార్ట్‌నర్స్ దొరుకుతున్నారు.

Telugu China, Hire, Alternative, February, Hire Boyfriend, Girlfriend, Temporary

టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు అద్దె పార్ట్‌నర్స్ ఆన్‌లైన్‌లోకి కూడా వచ్చేసారు.యాప్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో బుక్ చేసుకోవచ్చు.మీకు ఎలాంటి పార్ట్‌నర్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్యాకేజీలు చూసి పేమెంట్ చేయొచ్చు.

అంతే, టెంపరరీ పార్ట్‌నర్‌తో ఎంజాయ్ చేయొచ్చు.రిలేషన్‌షిప్ కమిట్‌మెంట్స్ లేకుండానే జస్ట్ కంపెనీ కోసమే.

Telugu China, Hire, Alternative, February, Hire Boyfriend, Girlfriend, Temporary

మన ఇండియాలో కూడా ఇలాంటి ట్రెండ్ ఒకప్పుడు ఉండేది.2018లో ముంబైలో “రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్”( Rent A Boyfriend ) అనే యాప్ లాంచ్ అయింది.2022 వరకు బెంగళూరు లాంటి పెద్ద సిటీస్‌కి కూడా ఎక్స్‌పాండ్ చేశారు.జాబ్ ఓపెనింగ్స్ కూడా ఇచ్చారు, అప్లై చేసేవాళ్లకి కొన్ని బ్యూటీ స్టాండర్డ్స్ కూడా పెట్టారు అంట.కానీ అనుకున్నంత డిమాండ్ రాలేదు.డేటింగ్ యాప్స్ బాగా పాపులర్ అవ్వడంతో ఈ ట్రెండ్ తగ్గిపోయింది.ఒకప్పుడు రేట్లు రూ.600 నుంచి రూ.6000 వరకు ఉండేవి.కానీ జనాలు మాత్రం డేటింగ్ యాప్స్‌వైపే మొగ్గు చూపారు.

ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఈ అద్దె పార్ట్‌నర్స్ బిజినెస్ మాత్రం బాగా నడుస్తోంది, ముఖ్యంగా వలెంటైన్స్ వీక్‌లో, ఒంటరిగా ఫీల్ అవ్వకుండా స్పెషల్ డేస్‌ని ఎంజాయ్ చేసేందుకు ఇది హెల్ప్ చేస్తుంది.వినడానికి కొంచెం వింతగా ఉన్నా.

ఒంటరిగా ఉన్నవాళ్లకి తోడు దొరుకుతుంది, అదీ కొద్దిసేపైనా సరే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube