తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్26, మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.47

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.45

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 సా4.40 ల6.40

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00

మేషం:

ఈరోజు సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి.చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు.నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి.

నూతన వాహన, గృహ యోగములు ఉన్నవి.వ్యాపార పరంగా ఉన్న ఇబ్బందులు క్రమం క్రమంగా తొలగుతాయి.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
శ్రావణ భార్గవి - హేమచంద్ర లవ్ స్టోరీ గురించి తెలుసా.. ఆ సినిమా టైం లోనే?

వృషభం:

Advertisement

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు నుండి బయటపడతారు.సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు.బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.వృత్తి వ్యాపార విషయమై ముఖ్య నిర్ణయం తీసుకుంటారు.

మిథునం:

ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో విజయం లభిస్తుంది.బంధు మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి.వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉంటాయి.

కర్కాటకం:

ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయం.ముఖ్యమైన సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి.సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

ఉన్నత విద్యా ప్రయత్నాలు కలసివస్తాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

సింహం:

ఈరోజు చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు.ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది.

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు.వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం వలన నష్టాలు తప్పవు.

నిరుద్యోగ యత్నాలు కలిసిరావు.

కన్య:

ఈరోజు గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు.చేపట్టిన పనులందు శ్రమ అధికమౌతుంది.ఇతరులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు పెరుగుతాయి.

దాయాదులతో స్థిరస్తి విషయమై ఉన్న సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి.స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి.

తుల:

ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు.భూవివాదాల నుంచి తెలివిగా బయటపడతారు.ఇంటబయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి.

నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

వృశ్చికం:

ఈరోజు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.సోదరులతో ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

మిత్రుల నుండి ధనలాభ సూచనలు ఉన్నవి.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ఆర్థిక విషయాలలో పురోగతి కలుగుతుంది.

ధనుస్సు:

ఈరోజు నూతన వ్యక్తులు పరిచయమవుతారు.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.నిరుద్యోగులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

మకరం:

ఈరోజు చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు.కీలక సమయంలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగటం మంచిది.సమాజంలో అందరిలోనూ గుర్తింపు పొందుతారు.

దాయాదుల తో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు.వృత్తి వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది.

కుంభం:

ఈరోజు నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.నిరుద్యోగులకు చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు పొందుతారు.

కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.బంధువులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీనం:

ఈరోజు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.ఉద్యోగులకు చిరకాల కోరిక నెరవేరి ఆశించిన అవకాశాలు పొందుతారు.

తాజా వార్తలు