కర్ణాటక ,తెలంగాణలో( Karnataka, Telangana ) మాదిరిగా ఏపీలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్( Congress ) హై కమాండ్ దానికి తగ్గట్లుగానే వ్యూహాలు రచిస్తోంది.ఏపీ, తెలంగాణ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
ఇక స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు.ప్రధానంగా వైసిపి , టిడిపి మధ్య ప్రధాన పోటీ అన్నట్లుగా పరిస్థితి ఉండడం, కీలక నాయకులంతా ఆ రెండు పార్టీలోనే ఉండడంతో, కాంగ్రెస్ లో పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు.
ఏపీ పైనే కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది.ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్యం ఠాకూర్( Manikyam Thakur ) కు బాధ్యతలు అప్పగించింది.
ఏపీలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పార్టీ బలోపేతం పైనే ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ముఖ్యంగా రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఏపీ వ్యవహారాలపై పూర్తిగా దృష్టి సారించారు.ఈ పార్టీ రాష్ట్ర నాయకులతో సమావేశంలో నిర్వహిస్తున్నారు.ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నేతలు సైతం యాక్టివ్ అయ్యారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం, విజయవాడ వేదికగా పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ లు నిర్వహించడం వంటివి చోటుచేసుకున్నాయి.ఇక మరింత స్పీడ్ పెంచేందుకు కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర కీలక నాయకులు కొందరిని ఢిల్లీ ( Delhi )రావాల్సిందిగా పిలుపునిచ్చింది.
డిసెంబర్ 27న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి ఏం చేయాలనే విషయం పైన ప్రధానంగా చర్చించనున్నారు.కర్ణాటకలో 5 గ్యారెంటీ లు, తెలంగాణలో 6 గ్యారంటీ హామీలతో రెండు చోట్ల అధికారంలోకి రావడంతో , ఏపీలోనూ ఆ తరహా గ్యారెంటీలను మేనిఫెస్టోలో చేర్చే అంశం పైన కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో రాహుల్ ,ప్రియాంక గాంధీలు విస్తృతంగా పర్యటించారు.
పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు .అదేవిధంగా ఏపీలోనూ రాహుల్ , ప్రియాంక గాంధీలు విస్తృతంగా పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఈ విషయాన్ని ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్దర్రాజు సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే.