తెల్ల జుట్టుకు చెక్ పెట్టే టీ పొడి..ఎలా వాడాలంటే?

ఈ మ‌ధ్య కాలంలో చిన్న వ‌య‌సులోనే తెల్ల జుట్టు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది.

పోష‌కాల లోపం, ఆహార‌పు అల‌వాట్లు, అధిక ఒత్తిడి, ఆందోళ‌న‌, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే షాంపూల వాడ‌కం, కేశాల విష‌యంలో స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు తెల్ల బ‌డుతూ ఉంటుంది.

యుక్త వయసులోనే జుట్టు తెల్ల బడటం వల్ల చూసేందుకు పెద్ద వాళ్లలా కనిపిస్తారు.అందుకే ఈ తెల్ల జుట్టును క‌వ‌ర్ చేసేందుకు క‌ల‌ర్ వేసుకుంటారు.

కానీ, కొన్ని టిప్స్ ఫాలో అయితే న్యాచుర‌ల్‌గానే తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు.ముందు తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చ‌డంలో టీ పొడి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి టీ పొడిని జుట్టుకు ఎలా యూజ్ చేయాలి అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్‌లో ఒక గ్లాస్ వాటర్ పోసి రెండు స్పూన్ల టీ పొడి క‌లిపి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు హిట్ చేయాలి.

Advertisement
Tea Powder Helps To Reduce White Hair! Tea Powder, Reduce White Hair, White Hair

ఆ త‌ర్వాత వాట‌ర్‌ను వ‌డ‌బోసుకుని.అందులో గోరింటాకు పొడి, ఉసిరి కాయ పొడి మ‌రియు కరక్కాయ పొడి వేసి మిక్స్ చేసుకోవాలి.

Tea Powder Helps To Reduce White Hair Tea Powder, Reduce White Hair, White Hair

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, కేశాల‌కు, కుదుళ్ల‌గా అప్లై చేసి గంట పాటు ఆర‌నివ్వాలి.అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉంటే షాంపూతో త‌ల స్నానం చేసేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే క్ర‌మంగా తెల్ల జుట్టు న‌ల్ల బ‌డుతుంది.

అలాగే ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసి రెండు స్పూన్ల టీ పొడి క‌లిపి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మ‌రిగించుకోవాలి.ఆ త‌ర్వాత వాట‌ర్‌ను వ‌డ‌బోసుకుని.

అందులో కొబ్బ‌రి నూనె పోసి మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని స్ప్రే బాటిల్ లో పోసి.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

జుట్టుకు స్ప్రే చేసుకోవాలి.అర గంట త‌ర్వాత జుట్టును గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి.

Advertisement

ఇలా మూడు రోజుల‌కు ఒక సారి చేస్తూ ఉంటే తెల్ల జుట్టు స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది.

తాజా వార్తలు