ఢిల్లీకి టీడీపీ యువనేత నారా లోకేష్..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) ఢిల్లీ బయలుదేరారు.

కొద్దిసేపటి క్రితం రాజమండ్రి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో బయలుదేరడం జరిగింది.

చంద్రబాబు ఆరెస్టు నేపధ్యంలో లోకేష్.ఢిల్లీ లో  ఎవరెవరిని కలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇదే సమయంలో టీడీపీతో.జనసేన పొత్తు కుదరటంతో లోకేష్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

లోకేష్ తో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడు( MP Rammohan Naidu ) కూడా ఢిల్లీ వెళ్తున్నారు.ఈ పర్యటనలో లోకేష్ పలువురు బీజేపీ నేతలను కలిసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో చంద్రబాబు( Chandrababu ) అరెస్ట్ అంశాన్ని జాతీయస్థాయిలో చర్చ జరిగేలా.పలువురు ఎంపీలకు లోకేష్ సూచనలు చేయనున్నట్లు సమాచారం.

చంద్రబాబు అరెస్టు పూర్తిగా కక్షపూరితంగా జరిగిందని జాతీయస్థాయిలో తెలియజేయాలని  చెప్పబోతున్నారట.ఇక ఇదే సమయంలో కింది స్థాయి కోర్టులలో ఇంకా హైకోర్టులలో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని సుప్రీమ్ న్యాయవాదులతో ఈ పర్యటనలో మాట్లాడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్టు కావడంతో లోకేష్ పాదయాత్ర ఆగిపోవడం తెలిసిందే.ఈ క్రమంలో చంద్రబాబుకి బెయిల్ వచ్చిన వెంటనే మళ్లీ లోకేష్ "యువగళం" పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.

ఆ ఆరు దేశాల్లోని భారతీయులకు వీసా ఆన్ అరైవల్ ఎంట్రీ .. యూఏఈ కీలక నిర్ణయం
Advertisement

తాజా వార్తలు