తెలుగు విద్యార్ధులకు ప్రత్యేకం “తానా స్టెమ్ మిషన్” ప్రోగ్రాం..!!!

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) గురించి తెలియని ఎన్నారై ఉండరు.

అమెరికాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలు అన్నిటికంటే కూడా తానా అతిపెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందింది.

ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ అమెరికాలో తెలుగు వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న తానా కేవలం అమెరికాలోని తెలుగు వారికోసం మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది.భారత్ నుంచీ అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్ధులకు స్కాలర్షిప్ లు అందించడంతో పాటు వారికీ ఎలాంటి అవసరాలు వచ్చినా వెంటనే స్పందిస్తూ అండగా నిలుస్తుంది తానా.

అయితే తాజాగా తానా 11-18 ఏళ్ళ వయసు ఉన్న పిల్లల కోసం స్టెమ్ మిషన్ ప్రోగ్రాం ను నిర్వహించింది.ఇందుకు గాను తానా స్టెమ్ ఫ్లైట్ సహకారం తీసుకుంది.

ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే.సైన్స్ అండ్ టెక్నాలజీ లో అలాగే ఇంజనీరింగ్, గణితం వంటి సబ్జక్టులలో చక్కని ప్రతిభ కనబరచడానికి మరీ ముఖ్యంగా విమానయాన విద్యా, పైలెట్ అనుభవాలను తెలుసుకునేలా ఉపయోగపడుతుంది.

Advertisement

అంతేకాదు విమానయానంలో ప్రవేశించడానికి ఇది అద్భుతమైన సాధనంగా ఉపయోగపడుతుందని, ఇందులో తమ కెరీర్ ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకునేందుకు ఓ మంచి అవకాశమని తానా ప్రకటించింది.ఇదిలాఉంటే తానా స్టెమ్ మిషన్ లో భాగంగా నిన్నటి రోజున కొందరు విద్యార్ధులకు అవగాహనా తరగతులు నిర్వహించారు.

https://nristreams.tv/tana-stem/ అనే లింక్ ద్వారా వర్చువల్ గా విద్యార్ధులు పాల్గొన్నారు.

భవిష్యత్తులో పిల్లలు ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నా ఈ పోటీ ప్రపంచంలో తిరుగులేని వ్యక్తులుగా ఎదగాలన్నా ఇలాంటి ముందస్తు అవగాహనా కార్యక్రమాలలో పాల్గొనడం ఎంతో మంచిదని ఇలాంటి కార్యక్రమాలు మన విద్యార్ధుల కోసం ఏర్పాటు చేస్తూనే ఉంటామని తానా నిర్వాహకులు తెలిపారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు