రాజమౌళి సినిమాను అలా తీసి ఉంటే బాగుండేది.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ మరికొన్ని రోజుల్లో 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల మార్కును అధిగమించనుంది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలన రికార్డులు సృష్టించిన ఆర్ఆర్ఆర్ ఇతర రాష్ట్రాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు ఒంటిపూట బడులు అమలులోకి రావడం కూడా ఒక విధంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్లస్ అవుతోందని తెలుస్తోంది.అయితే ప్రముఖ దర్శకనిర్మాతలలో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ ఆర్ఆర్ఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్ఆర్ఆర్ మూవీకి టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా ఇదే స్థాయిలో కలెక్షన్లు వచ్చేవని అయితే కొంచెం ఆలస్యంగా ఈ రేంజ్ లో కలెక్షన్లు వచ్చేవని తమ్మారెడ్డి అన్నారు.రాజమౌళి గ్రేట్ డైరెక్టర్ అని ఆయన ఇద్దరు చరిత్రకారులను ఒకే సినిమాలో చూపించకుండా ఒకరి చరిత్రతో సినిమాను తెరకెక్కించి ఉంటే బాగుండేదని తమ్మారెడ్డి కామెంట్లు చేశారు.ఆర్ఆర్ఆర్ మూవీ వల్ల చరిత్ర తెలియని వాళ్లు రామరాజు, భీమ్ కలిసి ఆడుకున్నారని భావించే ఛాన్స్ ఉందని

కొందరికి వీళ్లిద్దరి చరిత్రలు తెలుసని చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయకూడదని తమ్మారెడ్డి అన్నారు.రాజమౌళి ఒక్క ఫ్రేమ్ వృథా కాకుండా సినిమా తీస్తానని చెబుతారని మరి ఆయన సినిమాలకు ఎక్కువ సమయం ఎందుకు పడుతోందని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

Advertisement

పాన్ ఇండియా మార్కెట్ వచ్చిందని హీరోలు రెమ్యునరేషన్లు పెంచుతున్నారని ఆ ప్రభావం టికెట్ రేట్లపై పడుతోందని టికెట్ రేట్ల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతుండగా ఆయన కామెంట్ల గురించి రాజమౌళి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్లు రాజమౌళి ఫ్యాన్స్ ను మాత్రం బాధ పెడుతున్నాయి.

జక్కన్నను కావాలని టార్గెట్ చేసి కామెంట్లు చేస్తున్నారని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు