బుల్లి తెరపై టిఆర్పీ రేటింగ్స్ యుద్ధం.. తారక్, తమన్నా యుద్ధం

ప్రస్తుతం వెండి తెరకు ధీటుగా క్రేజ్ సంపాదించుకుంది బుల్లితెర.ఇంకా చెప్పాలంటే సినిమా రంగాన్ని తలదన్నే రీతిలో టీవీ రంగం ముందుకు సాగుతుంది.

ప్రజలను ఆకట్టుకునేలా పలు కార్యక్రమాలను రూపొందిస్తూ.టీవీకి అతుక్కుపోయేలా చేస్తున్నాయి ఆయా సంస్థలు.

అటు తమ తమ షోలకు మంచి గుర్తింపు తెచ్చుకునేలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి టీవీ యాజమాన్యాలు.అందులో భాగంగానే ఆయా షోలకు సినిమా తారలను హోస్టులుగా తీసుకొచ్చి జనాల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు.అటు సినిమా తారల విషయంలోనూ తీర మారుతూ వస్తుంది.

ఒకప్పుడు బుల్లితెర మీద కనిపించాలంటేనే చిన్నతనంగా భావించేవారు పలువురు నటీనటులు.టీవీ యాడ్స్ లో నటించడం అన్నా.

Advertisement
Tamannah And Tarak Small Screen War, Tamannah , Tarak , Small Screen , Tollywoo

టీవీ షోలకు హోస్టులుగా చేయాలన్నా నామోషీగా ఫీలయ్యేవారు.సినిమా పరిశ్రమ నుంచి ఫేడౌట్ అయిన సినిమా తారలు మాత్రమే టీవీ తెరలపై కనిపించేవారు.

కానీ ప్రస్తుతం పలు షోలకు క్రేజీ హీరోలు, హీరోయిన్లు హోస్టులగా కనిపిస్తున్నారు.తాజాగా మీలో ఎవరు కోటేశ్వరులు షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా చేస్తుండగా.

మాస్టర్ చెఫ్ షోకు మిల్కీబ్యూటీ తమన్నా హోస్టుగా కొనసాగుతుంది.ఈ నేపథ్యంలో ఏవరి షో.ఏంత రేటింగ్ సంపాదించింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Tamannah And Tarak Small Screen War, Tamannah , Tarak , Small Screen , Tollywoo

తెలుగు టీవీ పరిశ్రమలో చలా కాలంగా చక్కటి రేటింగ్ సాధిస్తున్న షో జబర్దస్త్.మల్లెమాల ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ షో ఈ వారం కూడా బ్రహ్మాండమైన రేటింగ్ సంపాదించింది.సిటీలో 6.45, గ్రామాల్లో 6.49 రేటింగ్ నమోదు చేసింది.అటు స్టార్ మాలో ప్రసారం అవుతున్న సిక్స్త్ సెన్స్ షో గ్రామాల్లో 5.44, సిటీలో 4.78 రేటింగ్ సాధించింది.

Tamannah And Tarak Small Screen War, Tamannah , Tarak , Small Screen , Tollywoo
స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!
అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

జనాల్లో ఫుల్ క్రేజ్ సంపాదించిన ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షో మాత్రం అనుకున్నంత స్థాయిలో రేటింగ్ రావట్లేదు.తొలి రోజు 11 రేటింగ్ సాధించిన ఈ షో.వారం గడిచే సరిక 4.82కు ప‌డిపోయింది.మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హోస్టుగా చేస్తున్న మాస్ట‌ర్ చెఫ్‌ సైతం రేటింగ్ లో అంతంత మాత్రంగానే ఉంది.ఈ షోకు కేవలం 4.64 శాతం రేటింగ్ వ‌చ్చింది.

Advertisement

తాజా వార్తలు