తమన్నా లేడీ ఓరియెంటెడ్ మూవీకి కళ్లు చెదిరే ఆఫర్లు.. ఎవరూ ఊహించలేదుగా!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా( Tamanna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

తమన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతుంది తమన్నా.సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ మెప్పిస్తోంది.

ఈ ముద్దుగుమ్మ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ అదే ఊపుతో అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది.

Tamanna Odela 2 Crazy Continues Details, Odela 2, Tollywood, Tamanna, Heroine Ta

ఇకపోతే తమన్నా ప్రధాన పాత్రలో తయారవుతున్న సినిమా ఓదెల 2.( Odela 2 ) అయితే ఈ సినిమా టీజర్ విడుదల వరకు ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తి లేదు.టీజర్ వచ్చిన తరువాత అందరి దృష్టి సినిమా వైపు మళ్లింది.ఓటిటి నుంచి 11.50 కోట్ల ఆఫర్ అందుకోవడం, హిందీ వెర్షన్ ను ఆరు కోట్లకు అమ్మడంతో క్రేజ్ అర్థం అయింది.కానీ అంత మాత్రం చేత అయిపోలేదు.

Advertisement
Tamanna Odela 2 Crazy Continues Details, Odela 2, Tollywood, Tamanna, Heroine Ta

ఇంకా చాలా వుంది వ్యవహారం.ఎందుకంటే సినిమా థియేటర్ లాండింగ్ కాస్ట్ 30 కోట్లు.

అంటే ఇంకా 12 నుంచి 13 కోట్లు రికవరీ కావాలి.తమిళ, కన్నడ, మలయాళ థియేటర్ వెర్షన్లు, సౌత్ ఇండియా శాటిలైట్ అన్నీ కలిపి తొమ్మిది నుంచి పది కోట్ల వరకు వస్తాయని అంచనా వేసుకుంటున్నారు.

Tamanna Odela 2 Crazy Continues Details, Odela 2, Tollywood, Tamanna, Heroine Ta

ఓన్లీ శాటిలైట్ ఆరు కోట్లు వస్తే గట్టెక్కేసినట్లే అంటున్నారు.తెలుగు థియేటర్ ఫ్రీ అయిపోతుంది.అందుకే ఏప్రిల్ 17 డేట్ అంటూ పోస్టర్ వేసేసారు.

ప్రస్తుతానికి అయితే ఆ డేట్ కు మరే సినిమా లేదు.సారంగపాణి జాతకం వస్తుందని అంటున్నారు కానీ ఇంకా ఓటిటి అమ్మకాలు కావాల్సి ఉంది.

నా తల్లీదండ్రుల పెళ్లికి మతం అడ్డు రాలేదు.. సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
జూనియర్ ఎన్టీఆర్ గొప్పదనం చెప్పిన విజయ్ దేవరకొండ.. అలా బిహేవ్ చేశారంటూ?

ఈ నేపథ్యంలోనే మంచి హర్రర్ ఇంటెన్సిటీ వున్న పోస్టర్ ను విడుదల చేసారు మూవీ మేకర్స్.ఇందులో తమన్నా లుక్ బాగుంది.

Advertisement

ఇప్పుడు ఈ లుక్ కావచ్చు, వదలబోయే కంటెంట్ లు కావచ్చు.థియేటర్ బజ్ ను పెంచాల్సి ఉంటుంది.

మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్స్ కాంబినేషన్ లో ఈ సినిమాను నిర్మించారు.తమన్నా, అశోక్ తేజ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్ తో ఈ సినిమాపై అంచనాలు కాస్త మరింత పెరిగాయి.

తాజా వార్తలు