చిరంజీవితో మాట్లాడితే సమస్య పరిష్కారం అవ్వదు.. సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్లపై తీసుకున్న నిర్ణయం పట్ల సినీ ఇండస్ట్రీ మొత్తం ఏపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తోంది.

ఈ క్రమంలోనే సినిమా టికెట్ల రేట్లను దారుణంగా తగ్గించడం వల్ల ఇండస్ట్రీ ఎంతో నష్టపోవాల్సి ఉంటుందని టికెట్ల రేట్లను పెంచే చర్యలు తీసుకోవాలని ఏఏపీ ప్రభుత్వాన్ని సినీ ఇండస్ట్రీ పెద్దలు ఎన్నోసార్లు వారి నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం ముందు ఉంచారు.

ఇలా ఈ వ్యవహారం గురించి ఎన్నో సార్లు ఏపీ ప్రభుత్వానికి విన్నపం చేసిన ఏపీ ప్రభుత్వం మాత్రం సినిమా టిక్కెట్ల రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ సమస్యల గురించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడడం కోసం ఆయనను ప్రత్యేకంగా విజయవాడ లోని ఆయన నివాసంలో కలిసిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ సమావేశం పై కొందరు సానుకూలంగా వ్యవహరించగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే సీపీఐ జాతీయ నేత నారాయణ మెగాస్టార్ చిరంజీవి పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కేవలం చిరంజీవి ఒక్కరు మాట్లాడితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరకిందని, ఉద్యోగుల సమస్యలను ఏపీ ప్రభుత్వం విభజించు.పాలించు అనే విధానాన్ని అనుసరిస్తోందని సినీ పరిశ్రమలో కూడా అలాంటి విధానాన్ని అనుసరిస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సమస్యపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

Advertisement

సమస్య సినిమా ఇండస్ట్రీ కనుక కేవలం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాకుండా ఫిలిం ఛాంబర్, నిర్మాత మండలికి సంబంధించిన వారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించి చర్చలు జరిపితేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని నారాయణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.గతంలో సీఎం జగన్ ను మెగాస్టార్ చిరంజీవి ఒంటరిగా కలవడమే ఆయన చేసిన పొరపాటని అసలు ఒంటరిగా కలవాల్సిన అవసరం ఏంటి అని కూడా ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు