తాలిబాన్ ప్రభుత్వం సరికొత్త కీలక ప్రకటన..!!

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆఫ్ఘనిస్థాన్ కి సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

తాలిబాన్లు ఎంటర్ కావడంతోనే ఆఫ్ఘనిస్థాన్లో మహిళల హక్కులను కాలరాయడం జరిగిందని ప్రచారం జరిగింది.

అంత మాత్రమే కాక తాలిబాన్లు కాబూల్ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలను మూసివేయడం జరిగిందని కూడా వార్తలు రావడం జరిగాయి.ఇటువంటి వార్తలు వస్తున్నా తరుణంలో తాలిబాన్లు ప్రభుత్వం తాజాగా సరికొత్త ప్రకటన విడుదల చేయడం జరిగింది.

Taliban Government's Latest Key Announcement Taliban, Afghanisthan, Taliban , Ab

విషయంలోకి వెళితే దేశంలో త్వరలోనే మదర్సాలు, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని తెలిపింది.కాని అందులో అమ్మాయిలు ఉండరని స్ఫష్టం చేసింది.

ఇటువంటి తరుణంలో తాలిబాన్ ప్రభుత్వం పై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.ఆడవాళ్ళకి కూడా విద్య కల్పించాలని ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ పాఠశాలలో అమ్మాయిలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

 ఆడవాళ్లపై వివక్షత చూపించకుండా పాలిస్తే బాగుంటుందని మరికొంతమంది సూచిస్తున్నారు.

ఎవర్రా మీరంతా..! వ్యక్తిని పాడె ఎక్కించి అలా డాన్సులు చేస్తున్నారు!
Advertisement

తాజా వార్తలు