‘RT4GM’ : వరుస అప్డేట్స్ తో అంచనాలు పీక్స్.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?

మాస్ మహారాజా రవితేజ- గోపీచంద్ మలినేని కాంబో ( RT4GM ) మరోసారి రిపీట్ కాబోతుంది.

ఇప్పటికే ఈ కాంబో మూడు సార్లు రాగా మూడు సార్లు కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.

దీంతో ఈ కాంబో ప్రకటించినప్పటి నుండి అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.గోపీచంద్ మలినేని( Gopichand Malineni )తో రవితేజ కొత్త మూవీ గత కొద్దీ రోజుల క్రితమే ప్రకటించారు.

డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత నాల్గవ సారి ఈ కాంబో చేతులు కలిపింది.

ఇక రవితేజ( Raviteja ) ఒక సినిమా రిలీజ్ అయితే మరో సినిమాను లాంచ్ చేయడం మాములే.అలాగే మొన్న దసరాకు టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) అలా రిలీజ్ అయ్యిందో లేదో ఇలా వెంటనే మళ్ళీ కొత్త సినిమాను స్టార్ట్ చేసాడు.ఇక మేకర్స్ కూడా ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసాడు.

Advertisement

నిన్న మొత్తం వరుస అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.నటుడు, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు.అలాగే టెక్నీషియన్స్ వివరాలు కూడా టీమ్ వెల్లడించారు.

ఈ సినిమాకు థమన్( Thaman ) సంగీతం అందిస్తున్నట్టు తెలిపారు.జీకే విష్ణు కెమెరా హ్యాండిల్ చేయనుండగా ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఈ సినిమాలో భాగం అయ్యారు.మైత్రి మూవీస్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా అతి త్వరలోనే షూట్ స్టార్ట్ కానుంది.

ఇక వీరసింహారెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్న గోపీచంద్ ఈ సినిమాను ఎలా డైరెక్ట్ చేస్తారో మాస్ రాజాకు క్రాక్ వంటి విజయం ఇస్తాడో లేదో చూడాలి.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు