చంద్రబాబుని పొగడ్తలతో ముంచేత్తిన సూపర్ స్టార్ రజినీకాంత్..!!

విజయవాడలో ఎన్టీఆర్ ( NTR )శతజయంతి వేడుకలో సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు వర్షం కురిపించారు.

తెలుగులో ప్రసంగించిన రజనీకాంత్.

తెలుగులో తప్పులు ఉంటే క్షమించాలని కోరారు.ఈ సభను చూస్తుంటే రాజకీయ మాట్లాడాలని అనిపిస్తుంది కానీ రాజకీయం మాట్లాడవద్దని అనుభవం చెబుతుందని తన మనసులో మాట తెలియజేశారు.

చంద్రబాబు విజన్ కలిగిన నాయకుడు అని కీర్తించారు.చంద్రబాబుతో తనకు 30 ఏళ్లుగా స్నేహం ఉందని వెల్లడించారు.

చంద్రబాబు( Chandrababu ) ఘనత దేశ విదేశీ నాయకులకు తెలుసని స్పష్టం చేశారు.హైదరాబాద్ ను హైటెక్ నగరంగా చంద్రబాబు మార్చారని కొనియాడారు.

Advertisement

ఇటీవల చాలా కాలం తర్వాత హైదరాబాద్ సందర్శించడం జరిగింది.ఆ సమయంలో నేను హైదరాబాద్ లో ఉన్నానా లేకపోతే న్యూయార్క్ లో ఉన్నానా అనిపించింది.20 ఏళ్ల కిందటే ఐటీరంగం అభివృద్ధి గురించి దేశంలో చెప్పిన వ్యక్తి చంద్రబాబు.ఆయన ఓడిపోయిన గెలిచిన.నిత్యం ప్రజలకు ఏదో చేయాలని తపిస్తుంటారు.2024 ఎన్నికలలో చంద్రబాబు గెలిస్తే దేశంలో ఏపీ నెంబర్ వన్ అవ్వటం గ్యారెంటీ అని.ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును దీవిస్తుంది అని రజనీకాంత్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు