అన్ని ఉన్న సుధీర్ బాబు కి అదొక్కటే మైనస్ !

13 ఏళ్లుగా స్టార్ యాక్టర్ గా అవ్వడానికి అలుపెరగని పోరాటమే చేస్తున్నాడు సుధీర్ బాబు.సూపర్ స్టార్ కృష్ణ కి అల్లుడు అయినా మహేష్ బాబు కి బావ అయినా సినిమాలు బాగుంటే తప్ప జనాలు ఆదరించారు అని చెప్పడానికి సుధీర్ బాబు ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.

2010 లో ఏ మాయ చేసావే సినిమాలో సమంత కి బ్రదర్ క్యారెక్టర్ చేసిన సుధీర్ బాబు ఆ తర్వాత శివ మనసులో శృతి అనే సినిమాతో హీరో గా అవతారం ఎత్తాడు.దీనికి ఒక రెండేళ్ల సమయం పట్టిన, సినిమా పర్వాలేదు అనిపించుకోవడం తో మొత్తానికి హీరో అయిపోయాడు.

ఆ తర్వాత ప్రేమ కథ చిత్రం వంటి ఒక వైవిధ్యమైన సబ్జెక్టు ని ఎంచుకొని సాలిడ్ హిట్ కొట్టడం తో పాటు మంచి అవకాశాలను కూడా సంపాదించాడు.

Sudheer Babu Career Up And Downs, Sudheer Babu , Career, Superstar Krishna, Bol

ఇక ఈ చిత్రం తర్వాత చాల ఏళ్ళ పాటు సుధీర్ కి హిట్ లేడు.2013 తర్వాత ఏడ పేద అరడజన్ సినిమాలు తీసిన ఒక్కటి కూడా జనాలకు నచ్చలేదు.ఇక తెలుగు లో కష్టం అనుకోని బాడీ బాగా పెంచి భాగీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement
Sudheer Babu Career Up And Downs, Sudheer Babu , Career, Superstar Krishna, Bol

ఈ సినిమా వల్ల సుధీర్ బాబు కి ఒరిగింది ఏమి లేదు.ఇక కొన్ని గెస్ట్ అప్పియరెన్స్ లు, ఓటిటి లతో మరొక అర డజన్ సినిమాలతో దండయాత్ర చేసిన ఏది పెద్దగా కలిసి రాలేదు.

ఇక ఇక ఈ ఏడాది ఆరంభమే ముంబై పోలీస్ రీమేక్ చేస్తూ హంట్ అనే సినిమాను తీస్తే అది కూడా ఫట్ అంది.ఇక మరొక తెలుగు మరియు హిందీ భాషలో నిర్మితం అవుతున్న సినిమాలో అలాగే మాయ మచ్చింద్ర అనే సినిమాలో సుధీర్ బాబు ప్రస్తుతం నటిస్తున్నాడు.

Sudheer Babu Career Up And Downs, Sudheer Babu , Career, Superstar Krishna, Bol

ఎన్ని సినిమాలు చేసిన ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నాకూడా అతడికి ఫిలిం ఇండస్ట్రీ పెద్దగా ఉపయోగపడటం లేదు.అయితే అదృష్టం కొద్దీ మొదటి రెండు సినిమాలు పర్వాలేదు అనిపించడం తో ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాడు కానీ సుధీర్ బాబు కి ఎక్సప్రెషన్స్ పలకవని, అతడు అంత పెద్ద నటుడు ఏమి కాదని, కానీ ఈ మధ్య బాగా బాడీ పెంచి దానితో విన్యాసాలు చేస్తున్నాడు తప్ప పెద్దగా నటన లేదు అని తేల్చి పడేస్తున్నారు కొందరు.ఏది ఏమైనా ఒక్క సాలిడ్ హిట్ పడితే సుధీర్ బాబు మరో పదేళ్లు ముందుకు వెళ్లడం ఖాయం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు