అప్పుడు టోటల్ రూ.18 కోట్లు.. ఇప్పుడు ఒక్కరోజు కలెక్షన్లు రూ.18 కోట్లు.. బాలయ్య ఎదిగిన తీరుకు ఫిదా అవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ భగవంత్ కేసరి ( Bhagwant Kesari )సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.

ఈ సినిమా రెండు రోజుల్లో 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది.

ఈ సినిమా టార్గెట్ 70 కోట్ల రూపాయలు కాగా ఇప్పటికే 40 శాతం టార్గెట్ ను రీచ్ అయింది.ఈ వీకెండ్ కు భగవంత్ కేసరి డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.

లియో, టైగర్ నాగేశ్వరరావు( Leo, Tiger Nageswara Rao ) సినిమాలకు ఆశించిన టాక్ రాలేదు.

Star Hero Balakrishna Bhagavant Kesari Comparison With Other Movies Details He

అయితే బాలయ్య గత కొన్నేళ్లలో కెరీర్ పరంగా ఎదిగిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.లెజెండ్ తర్వాత అఖండ ముందు బాలయ్య నటించిన సినిమాలు ఆశించిన రేంజ్ లో హిట్ కాలేదు.రూలర్, జై సింహా( Ruler, Jai Simha ) లాంటి సినిమాలు ఫుల్ రన్ లో కేవలం 18 కోట్ల రూపాయలకు అటూఇటుగా సాధించాయి.

Advertisement
Star Hero Balakrishna Bhagavant Kesari Comparison With Other Movies Details He

ఇప్పుడు బాలయ్య ఒక్కరోజులో ఆ టార్గెట్ ను సాధించడం గమనార్హం.బాలయ్య గత సినిమా వీరసింహారెడ్డి ఫస్ట్ డే కలెక్షన్లు దాదాపుగా 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నాయి.

Star Hero Balakrishna Bhagavant Kesari Comparison With Other Movies Details He

వరుసగా ఫ్లాపులు ఎదురైన సమయంలో బాలయ్య నిరాశ చెందలేదు.కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో మారిన బాలయ్య వరుస విజయాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు.మూవీ క్రిటిక్స్ సైతం దసరా విన్నర్ భగవంత్ కేసరి అని ముక్త కంఠంతో చెబుతున్నారు.

ఈ సినిమాలోని మెసేజ్ సైతం అద్భుతంగా ఉంటుంది.బాలయ్య బాక్సాఫీస్ కు కళ తీసుకొనిరావడంతో పాటు వరుస విజయాలను అందుకుంటున్నారు.

బాలయ్య సినిమాలేవీ ఇప్పటివరకు 100 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్కును అందుకోలేదు.ఈ సినిమా నుంచి ఆ లెక్క కూడా మారుతుందని బాలయ్యకు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు దక్కుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్న బాలయ్య పాన్ ఇండియా విజయాలను భవిష్యత్తులో అందుకుంటారేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు