శిధిలావస్థలో పశువుల దవాఖాన హడలి పోతున్న సిబ్బంది...!

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామరం మండల కేంద్రంలో పురాతన కాలంలో నిర్మంచిన రెండు గదుల పశు వైద్యశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరి, ఏ క్షణమైనా కూలిపోయే స్థితికి చేరుకున్నా గత పదేళ్ళుగా పాలకులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఎంతో కాలం నుండి మండల కేంద్రంతో పాటు,పరిసర గ్రామాల పశువులకు ఈ ఆసుపత్రిలో వైద్యసేవలు అందిస్తున్నా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని, ఇక్కడ పనిచేసే డాక్టర్లు,సిబ్బంది శిధిలమైన భవనంలో ఉండలేక బిక్కు బిక్కుమంటూ గడుపుతూ పశువులకు సరైన వైద్యసేవలు కూడా అందించలేకపోతున్నారని వాపోతున్నారు.

గత ప్రభుత్వాలు ఎన్నిసార్లు విన్నవించినా పశు వైద్యశాలపై దృష్టి సారించకపోవడం బాధాకరం అంటున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త భవనానికి నిధులు మంజూరు చేసి ఆధునిక వసతులతో శాశ్వత భవనం నిర్మించాలని కోరుతున్నారు.

నేత కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు

Latest Video Uploads News