Sr NTR: ఒక ముఖ్యమంత్రిని ఇంటి ముందు అరగంట నిల్చోబెట్టిన ఎన్టీఆర్ .!

ఎక్కడ చరిత్ర చూసుకున్న ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రిని ఇంటి ముందు అరగంట సేపు ఎదురు చూసేలా చేసిన సంఘటన జరిగి ఉండదు.

కానీ మన ఉమ్మడి తెలుగు రాష్ట్రం అయినా ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం జరిగింది.

ఎన్టీఆర్( NTR ) రాష్ట్రాన్ని మొత్తం లక్ష్మి పార్వతి( Lakshmi Parvathi ) చేతిలో పెట్టి బ్రష్టు పట్టించబోతున్నట్టు వరస మీడియా కథనాలను వెల్లడించి ఆయనను వైస్రాయ్ హోటల్ ముందు చెప్పు తో దాడి చేయించి ఎన్టీఆర్ మనసు విరిగిపోయేలా చేసి చివరాఖరికి 1995 లో ఎన్టీఆర్ ని గద్దె దించి ఒక మంచి ముహూర్తం చూసుకొని చంద్ర బాబు( Chandrababu Naidu ) ముఖ్యమంత్రి గా గద్దె ఎక్కాడు.

Sr Ntr Insults To Chandra Babu

ఇది అందరికి తెలిసిన స్టోరీ అయినా కూడా బాబు ఒక మంచి రాజకీయ నాయకుడు. అయన బుర్ర పాదరసం లా పని చేస్తుంది.తప్పు చేసిన ఎవరికి చిక్కకుండా చేయాలి అని బాబు ఎప్పుడు ప్రయతించడం అందరికి తెలుసు.

అయితే చంద్రబాబు ముఖ్య మంత్రి పీఠం అధిరోహించగానే చేసిన మొదటి పని తన మన ఎన్టీఆర్ దగ్గరికి ఆశీర్వాదం కోసం వెళ్లడం.ఎందుకు అంటే చంద్ర బాబు ఎన్టీఆర్ ఆశీస్సులతోనే గద్దె ఎక్కి పాలించబోతున్నట్టు మీడియా లో వార్తలు వస్తే జనాలు పానిక్ అవ్వకుండా ఉంటారు కాబట్టి .కానీ ఎన్టీఆర్ బాబు తన ఇంటి ముందు అరగంటకు పైగా ఎదురు చుసిన కూడా అయన గది నుంచి లోపలి రమ్మనే పిలుపు రాలేదు.దాంతో ఏం చేయలేక అక్కడ నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయాడు.

Sr Ntr Insults To Chandra Babu
Advertisement
Sr Ntr Insults To Chandra Babu-Sr NTR: ఒక ముఖ్యమంత్రి

ఇది జరిగిన తర్వాత కూడా ఎన్టీఆర్ సూపర్ విజన్ లోనే బాబు పాలిస్తున్నాడు, బాబు చక్కగా పాలిస్తున్నట్టు ఎన్టీఆర్ మెచ్చుకుంటున్నాడు అంటూ ఎన్నో వడ్డించిన వార్తలు వచ్చాయి.ఇది చూసి ఎన్టీఆర్ మరింత కృంగిపోయి అతి తక్కువ కాలంలోనే మరణించడం మనం చూసాం.ఇలా దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రిని తన ఇంటి ముందు అరగంటకు పైగా ఎదురు చూసేలా చేసుకోవడం కేవలం ఎన్టీఆర్ ఒక్కడికే చెల్లింది.

కానీ బాబు ఈ అవమానానికి పూర్తిగా అర్హుడు అనేది జగమెరిగిన సత్యం.ఎంతటి వాడైనా సరే తనను తన్నే వాడు ఉంటె తాడిని తన్నేవాడు మరొకడు వస్తాడు అని బాబు విషయంలో జగన్ నిరూపించాడు.

Advertisement

తాజా వార్తలు