జూనియర్ ఎన్టీఆర్.( Jr NTR ) చిన్నతనం నుంచి ఎన్నో అల్లరి పనులు చేస్తూ అమ్మ చేత చితక్కొట్టించుకోవడం లో ఎప్పుడు ముందుడేవాడు.
ఎన్నో సార్లు తారక్ తాను ఎంత అల్లరి పిల్లాడినో అంటూ మీడియా సమావేశాల్లో చెప్పడం మనం చేసుతూనే ఉన్నాం.పైగా మాములు పిల్లల లాగ కాకుండా ఫ్రెండ్స్ తో తన వయసుకి మించి అల్లరి చేసేవాడు.
పైగా చదువు కూడా మామూలుగానే ఉండేది.దాంతో తారక్ తల్లికి అతడిని పెంచడం తలకు మించిన భారం అయ్యేది.
తారక్ ని విపరీతంగా కొట్టి ఆమె కూడా ఎన్నో సార్లు ఏడ్చినా సంఘటనలు కూడా ఉన్నాయ్ అంటూ తారక్ సైతం చెప్పేవాడు.

కానీ ఎంత ప్రయత్నించినా ఒక ఏజ్ వచ్చే వరకు అల్లరి మనలేక పోయానని, తన పిల్లలు మాత్రం ప్రణతి పెంపకం లో చాల చక్కగా పెరుగుతున్నందుకు తనకు చాల సంతోషంగా ఉంది అంటూ చెప్తూ ఉంటాడు.షాలిని ని ( Shalini ) నందమూరి కుటుంబం ఎన్నో ఏళ్ళ పాటు ఒప్పుకోక పోవడం తో సింగల్ పేరెంట్ గానే చాలా కష్టపడి పెంచి పెద్ద చేసింది.బయట నుంచి హరికృష్ణ ( Hari Krishna ) ఎంత సపోర్ట్ చేసిన అన్ని దగ్గర ఉండి చూసుకోవాల్సిన బాధ్యత ఆమె పైనే ఉండటం వల్ల కూడా చాల స్ట్రెస్ తీసుకోవాల్సి వచ్చేది.

అయితే తన చిన్న తనం లో చేసిన ఎన్నో అల్లరి పనులలో బాగా గుర్తు ఉన్న సంఘటన ఏంటి అంటూ ఒక మీడియా ఇంటర్వ్యూ లో జూనియర్ ఎన్టీఆర్ ని యాంకర్ ప్రశ్నించగా అందుకు తన వల్ల తమ కాలనీ వాళ్లకు రెండు రోజుల పటు కరెంటు లేకుండా చేసిన సంఘటన పంచుకున్నాడు తారక్.ఒకసారి ఇంట్లో బల్బ్ తీసుకెళ్లి ట్రాన్స్ఫార్మర్ లో పెట్టడం తో అది కాస్త పేలిపోయిందని దాంతో కరెంటు డిపార్ట్మెంట్ వారు రెండు రోజులు ప్రయత్నిస్తే తప్ప ఆ ట్రాన్స్ఫార్మర్ బాగు కాలేదు అని., దాంతో రెండు రోజులు కాలనీ మొత్తం చీకట్లోనే ఉన్నారంటూ తారక్ తాను చేసిన చిలిపి పని గురించి చెప్పాడు.అంతే కాదు తానే ఆ ట్రాన్స్ఫార్మర్ పేలడానికే కారణం అనే విషయం తన అమ్మకు తెలియకపోవడం తో బ్రతికి పోయానని లేకపోతే మా అమ్మ కొట్టి చెంపేసేది అంటూ సరదాగా చెప్పుకోచ్చారు.