కే‌సి‌ఆర్ కు దక్షిణ తెలంగాణ ముప్పు..!

తెలంగాణ ముఖమంత్రి కే‌సి‌ఆర్( KCR ) ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది సరికొత్త స్ట్రాటజీలతో ముందుకు సాగుతున్నారు.

తొలి మలి జాబితాలు కాకుండా ఏకంగా 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థి పార్టీలకు గట్టి షాక్ ఇచ్చారు.

ఇక మిగిలిన నాలుగు స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు.దీంతో నుంచి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవలని కే‌సి‌ఆర్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఆల్రెడీ పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో కాకుండా బలహీనంగా ఉన్న స్థానాలపై ఎక్కువ ఫోకస్ చేయాలని కే‌సి‌ఆర్ భావిస్తున్నాట.అందుకే ఈ సారి దక్షిణ తెలంగాణపై ఎక్కువ దృష్టి పెట్టాలని కే‌సి‌ఆర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఉత్తర తెలంగాణతో పోల్చితే దక్షనాది పార్టీ కొంత బలహీనంగా ఉంది.

Advertisement

అందువల్ల నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 100 కు పైగా సీట్లు సాధించాలంటే దక్షిణాదిన పట్టు సాధించడం చాలా అవసరం.అయితే దక్షిణాదిన పలు అంశాలు కే‌సి‌ఆర్ సర్కార్ ను వేలెత్తి చూపేలా చేస్తాయి.ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్( Palamuru Ranga Reddy Project ) ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ఆ ప్రాంత ప్రజల నుంచి కే‌సి‌ఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

ఎందుకంటే అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ( Kaleshwaram Project )ను తక్కువ బజ్దెట్ తో తక్కువ రోజుల్లో పూర్తి చేసిన కే‌సి‌ఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో ఎందుకు చిన్నచూపు వహిస్తున్నారనే ప్రశ్న ఆ ప్రాంత ప్రజలు లేవనెత్తే అవకాశం ఉంది.దీంతో పాలన పరంగా కే‌సి‌ఆర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలూ కూడా కొందరిలో ఉన్నాయి.

దీంతో ఈసారి దక్షిణాదిన బి‌ఆర్‌ఎస్( Brs ) కు షాక్ తగిలే అవకాశం ఉందనేది కొందరు రాజకీయ వాదులు చెబుతున్నా మాట.గత ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో మెజారిటీ స్థానాలను బి‌ఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.కానీ ఈసారి మాత్రం ప్రజావ్యతిరేకత తప్పేలాలేదు.

మరోవైపు బిజెపి, కాంగ్రెస్( BJP , Congress ) పార్టీలు దక్షిణ తెలంగాణపై గట్టిగా ఫోకస్ చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఏకంగా కే‌సి‌ఆరే రంగంలోకి దిగారు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

వచ్చే ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ లోని గజ్వేల్ అలాగే దక్షిణ తెలంగాణలోని కామారెడ్డి ఇలా రెండు నియోజిక వర్గాల్లో పోటీ చేస్తూ పార్టీకి మైలేజ్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.మరి కే‌సి‌ఆర్ ప్లాన్స్ ఎంతవరుకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు