రియల్‌ హీరో : ఎడ్లు కాదు ఏకంగా ట్రాక్టర్‌ నే పంపించాడు

ఏపీ చిత్తూరు జిల్లాకు చెందిన నాగేశ్వరావు అనే రైతు నాగలికి ఎడ్లు లేక పోవడంతో ఆయన కూతుర్లు నాగలి లాగుతుండగా విత్తనాలు వేశాడు.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

వీడియోకు స్పందించిన సోనూసూద్‌ రేపు ఉదయం వరకు మీ ఇంటి వద్ద ఎడ్ల జత ఉంటుంది.వాటితో మీరు వ్యవసాయం చేయండి, మీ పిల్లలు చదువుపై దృష్టి పెడతారంటూ ట్వీట్‌ చేశాడు.

ఆ ట్వీట్‌ చేసిన మూడు గంటల్లోనే ఆ రైతు ఇంటికి ఎడ్లు కాకుండా ఏకంగా కొత్త ట్రాక్టర్‌ వెళ్లింది.ఎడ్లను సాయం చేయడం కంటే ట్రాక్టర్‌ను సాయంగా అందించడం బెటర్‌ అనే నిర్ణయానికి వచ్చిన సోనూసూద్‌ స్థానిక ట్రాక్టర్‌ డీలర్‌తో మాట్లాడి ఆయన ఇంటికే ట్రాక్టర్‌ వెళ్లేలా చేశాడు.

దాంతో ఆయన కుటుంబం ఆనందంకు అవధులు లేకుండా పోయాయి.ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా సోనూసూద్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు.

Advertisement

ఆనందంతో ఇకపై సోనూ సూద్‌ తమకు సొంత అన్నయ్య అంటూ కన్నీరు పెట్టుకున్నారు.తమ కష్టం చూసి సాయం చేసిన ఆయనకు కృతజ్ఞతలు అంటూ రైతు పేర్కొన్నాడు.

సోనూ సూద్‌ హెల్ప్‌ను ప్రశంసించిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రైతు కూతుర్ల చదువుకు సంబంధించిన ఖర్చు అంతా తాను భరిస్తానంటూ ప్రకటించాడు.ఈ విషయంలో వారికి కావాల్సిన ఆర్థిక సాయంను చంద్రబాబు నాయుడు భరించనున్నాడు.మొత్తానికి ఒక్క సోషల్‌ మీడియా పోస్ట్‌తో ఆ రైతు కుటుంబ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

మొన్నటికి నిన్నటికి నేటికి మొత్తం మారిపోయింది.ఇప్పటికే ఎన్నో వేల కుటుంబాలకు సాయం చేసిన సోనూసూద్‌ ఈసారి చేసిన సాయం మరింత మందికి కనువిప్పుగా నిలిచిందనడంలో సందేహం లేదు.

ఈ హోం మేడ్‌ ఆయిల్‌ను వాడితే జుట్టు రాల‌మ‌న్నా రాల‌దు..!
Advertisement

తాజా వార్తలు