ఆ ' శక్తి ' నే నమ్ముకున్న వీర్రాజు ? 

ఏపీలో బీజేపీ ని బలమైన రాజకీయ శక్తిగా మార్చేందుకు కష్టపడుతున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు.గతంతో పోలిస్తే వీర్రాజు హయాంలో బిజెపి పర్వాలేదు అన్నంత స్థాయిలో బలపడింది.

మొదట్లో వైసీపీ అనుకూల ముద్ర బిజెపి పైన ఉండేది.  అలాగే వీర్రాజు వ్యవహారం ఉండేది.

కానీ బిజెపి తన స్టాండ్ మార్చుకోవడంతో వీర్రాజు సైతం మొహమాటాలు పక్కనపెట్టి వైసిపి టిడిపి సమానంగానే విమర్శలు చేస్తున్నారు.అధికార పార్టీ ప్రకటనల పైన ఆందోళనలు చేపడుతూ,  బీజేపీ ఉనికిని చాటేందుకు వీర్రాజు ప్రయత్నిస్తున్నారు .రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గౌరవప్రదమైన స్థానం దక్కేలా ప్రణాళికలు రచిస్తున్నారు .   జనసేన పార్టీతో పొత్తు కొనసాగుతుంది కాబట్టి ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయనే నమ్మకం వీర్రాజు లోనూ కనిపిస్తోంది.ఇదిలా ఉంటే బీజేపీని అధికారంలోకి తీసుకు రావాలంటే భారీగానే కసరత్తు చేయాలని వీర్రాజు నమ్ముతున్నారు.

  దీనిలో భాగంగానే బూత్ కమిటీల ఏర్పాటు విషయంపై దృష్టి సారించారు.అంతే కాదు ప్రతి 5 బూత్ కమిటీలను శక్తి కేంద్రాలుగా మార్చే ఆలోచనలో ఉన్నారు.

Advertisement
Somu Weeraraj Focuse On The Issue Of Strengthening The Ap Bjp Ap BJP, Somu Veerr

రాష్ట్రవ్యాప్తంగా 15 వేల శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా,  బిజెపి అనుకున్న ఫలితం సాధిస్తుందని వీర్రాజు నమ్ముతున్నారు.బిజెపికి రాష్ట్రవ్యాప్తంగా బలమైన నాయకులు బీజేపీ కి ఉన్నారని,  క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్నారని వీరందరినీ యాక్టీవ్ చేయడం ద్వారా బీజేపీకి అవకాశం దక్కుతుందని వీర్రాజు నమ్ముతున్నారు.   

Somu Weeraraj Focuse On The Issue Of Strengthening The Ap Bjp Ap Bjp, Somu Veerr

ప్రస్తుతం ఏపీ బీజేపీ లో రెండు వర్గాల నాయకులు ఉన్నారు.ఒక వర్గం టిడిపి ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తుండగా,  మరో వర్గం మాత్రం జగన్ కు మద్దతుగా నిలబడుతోంది.ఇక మూడో వర్గం గురించి చెప్పుకుంటే.

  ఆర్.ఎస్.ఎస్ భావజాలం నుంచి వచ్చిన వారు మాత్రమే బిజెపి విధానాలను తూచా తప్పకుండా పాటిస్తూ,  పార్టీని బలోపేతం చేసే అంశంపై దృష్టి సారిస్తున్నారు.ఏపీ బిజెపికి ఎక్కువగా అండగా నిలుస్తున్న వర్గాల్లో క్షత్రియ సామాజిక వర్గంతో పాటు , కాపు సామాజిక వర్గం  కూడా అండ దండలు అందిస్తోంది.

రాష్ట్ర నాయకత్వం లో చాలామంది వీర్రాజు కు అనుకూలంగా వ్యవహరించకపోవడం వంటి వాటిని అధిష్టానానికి అనేకమార్లు ఆయన ఫిర్యాదు చేశారు.శక్తి కేంద్రాల ను బలోపేతం చేయడం ద్వారా ఏపీలో తనకు మంచి గుర్తింపు రావడంతో పాటు పార్టీ మరింత బలోపేతం అవుతుందని అధిష్టానం పెద్దల దృష్టిలో తనకు మంచి మార్కులు పడతాయి అని నమ్ముతున్నారు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025

  అందుకే ఇప్పుడు బూత్ కమిటీల బలోపేతం చేసి శక్తి కేంద్రాలు మరింత సమర్థవంతంగా పని చేసేలా చేసేందుకు వీర్రాజు ప్రయత్నాలు మొదలు పెట్టారు .ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా అనేక సమస్యలపై ఆందోళనలు చేపడుతూ టిడిపి, వైసిపి లకు ప్రత్యామ్నాయం తామే అనే విధంగా వీర్రాజు వ్యవహారాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు