బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోహెల్..!!

బిగ్ బాస్ హౌస్ లో సీజన్ ఫోర్ లో టైటిల్ విన్నర్ అభిజిత్ గెలిచినా గాని బయట పాపులారిటీ, క్రేజ్ ఎక్కువ సంపాదించిన కంటెస్టెంట్ సోహెల్ అని అందరూ అంటున్నారు.

హౌస్ లో ఎలాంటి విషయంలో అయినా ఉన్నది ఉన్నట్టు, మనసులో ఏది దాచకుండా మొహం మీద చెబుతూ జెన్యూన్ గేమ్ ఆడి మూడో ప్లేస్ లో నిలిచిన సోహెల్.

అప్పట్లో పాతిక లక్షల గెలవటం అందరికీ తెలిసిందే.అయితే అంతకుముందు హౌస్ లో ఒకానొక సమయంలో ప్రైజ్ మనీ గెలిస్తే.

బయట ఏం చేస్తారు అని బిగ్ బాస్ అడిగిన ప్రశ్నకు.సోహైల్ సమాధానం ఇస్తూ అనాధలకు 10లక్షల సాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది.

ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన మాటను హౌస్ నుండి బయటకు వచ్చిన సోహెల్ నిలబెట్టుకున్నాడు.ఇటీవల 10 లక్షల చెక్కుల రూపంలో పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు సేవా ఆశ్రమాలకు సహాయం చేయడం జరిగింది.ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సోహెల్ మాట్లాడుతూ.

Advertisement

బిగ్ బాస్ తన లో చాలా మార్పులు తీసుకు వచ్చిందని చెప్పుకొచ్చాడు.తాను హౌస్ లో గెలిస్తే 10 లక్షలు ఇస్తానని చెప్పడం జరిగింది అలాగే ఇవ్వటం జరిగిందని క్లారిటీ ఇచ్చాడు.

అంతేకాకుండా రాబోయే రోజుల్లో సినిమాలో వచ్చే ప్రతి రెమ్యూనరేషన్ లో 10 నుంచి 15 శాతం వరకు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ అని మాట ఇచ్చాడు.అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థలతో పాటు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఒక కుటుంబానికి 10 లక్షల కూడా ఇవ్వటం గమనార్హం.

ఈ సందర్భంగా బయట యువత కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అనాధలకు సహాయం చేయాలని సోహెల్ పిలుపునిచ్చాడు.అదేవిధంగా ప్రైజ్ మనీ విషయంలో హెల్ప్ చేసిన నాగార్జున గారికి స్పెషల్ థాంక్స్ తెలిపాడు.

నాగార్జునగారు ఎంతో గొప్ప మనసున్న వ్యక్తి అని సోహెల్ పొగడ్తలతో ముంచెత్తాడు.

రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!
Advertisement

తాజా వార్తలు