శ్రావణ మాసంలో ఏ పనులు చేయాలి.. ఏం చేయకూడదో తెలుసా?

హిందూ ప్రజలకు శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైనది.ఈ నెలలో మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఈ క్రమంలోనే శ్రావణమాసంలో వివిధరకాల పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ మహిళలు ఆధ్యాత్మిక భావనలు నిమగ్నమవుతారు.శ్రావణ మాసంలో సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.

ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పనులు చేయాలి? ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.శ్రావణ మాసంలో చేయాల్సిన పనులు:శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన మాసం కనుక ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని ఆ పరమశివుడికి, అమ్మవారికి ప్రత్యేక పూజలను చేయాలి.ఈ విధంగా పూజలు చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉండి అన్ని శుభాలు కలుగుతాయి.

ఈ విధంగా శివుడికి పూజ చేసేటప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి.శ్రావణ సోమవారం ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేసే మంగళ హారతి ఇవ్వాలి.

Advertisement
Shravan Month Dos And Donts In Telugu, Shravan Masam, Dates, Significance, Puja

శ్రావణమాసంలో పాలు పాల పదార్థాలను దానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.ఈ శ్రావణ మాసంలో పరమేశ్వరుడిని స్మరిస్తూ రుద్రాక్షలు ధరించడం ఎంతో మంచిది.

Shravan Month Dos And Donts In Telugu, Shravan Masam, Dates, Significance, Puja

శ్రావణ మాసంలో చేయకూడని పనులు:హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఎవరు మాంసం ముట్టుకోకూడదు.అదేవిధంగా నూనె ను ఉపయోగించి బాడీ మసాజ్ వంటివి చేసుకోకూడదు.శ్రావణమాసంలో మధ్యాహ్నం నిద్ర నిషేధించారు.

అదేవిధంగా మగవారి గడ్డం జుట్టు కత్తిరించు కూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.శ్రావణమాసంలో ఉల్లిపాయలు వెల్లుల్లి వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.

రాగి పాత్రలో చేసిన ఆహార పదార్థాలను తినకూడదు.ముఖ్యంగా పరమశివుడిని పూజించే సమయంలో తులసి ఆకులను అసలు ఉపయోగించకూడదు.

సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు