విజయ్ దేవరకొండకు సందీప్ రెడ్డి వంగా అవసరమా.. ఈ కాంబినేషన్ కు తిరుగులేదా?

పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేశారు.

టాక్సీవాలా మూవీ( Taxiwala movie ) కూడా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడింది.

అయితే ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ ఏ ప్రాజెక్ట్ లో నటించినా ఆ సినిమా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కాలేదు.ఖుషి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందలేదు.

విజయ్ దేవరకొండకు ప్రస్తుత పరిస్థితుల్లో సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) అవసరమని ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తే చాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.సందీప్ రెడ్డి వంగా సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.

సందీప్ సినిమాలు సులువుగా 800 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

Advertisement

మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.సందీప్ రెడ్డి వంగా వరుసగా పాన్ ఇండియా హీరోలతో సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.విజయ్ దేవరకొండ పారితోషికం 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా సందీప్ రెడ్డి వంగా తన సినిమాలకు తన కుటుంబ సభ్యులే సహ నిర్మాతగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

విజయ్ దేవరకొండ సైతం కథల విషయంలో మారడంతో పాటు డైలాగ్ డెలివరీ విషయంలో కొత్తదనం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.విజయ్ దేవరకొండ నెగిటివ్ కామెంట్లలో వాస్తవాలను అర్థం చేసుకుని కొన్ని విషయాలలో మారితే బెటర్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విజయ్ దేవరకొండ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు