సవాల్ చేస్తే సీఎం అవుతారా.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి రేవంత్ వరకు ఇదే జరిగిందా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తన మార్క్ పాలనతో ప్రశంసలు అందుకుంటున్నారు.

సీఎంగా పదవి చేపట్టిన వెంటనే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సత్తా చాటుతున్నారు.

కేసీఆర్ ను( KCR ) పరామర్శించాలని రేవంత్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని కార్లకు 0009 నంబర్ ను కేటాయించడం జరిగింది.

అయితే సవాల్ చేసి రేవంత్ రెడ్డి సీఎం కాగా గతంలో కూడా పలువురు ముఖ్యమంత్రులు ఎన్నో కష్టాలు పడి సవాల్ చేసి అధికారాన్ని దక్కించుకున్నారు.సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారనే సంగతి తెలిసిందే.

అప్పట్లో తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఇందిరా గాంధీకి సవాల్ విసిరి మరీ సీనియర్ ఎన్టీఆర్ కేవలం తొమ్మిది నెలల్లో పార్టీని అధికారంలోకి తెచ్చారు.

Shocking Facts About Telugu States Chief Ministers Ntr To Revanth Reddy Details,
Advertisement
Shocking Facts About Telugu States Chief Ministers Ntr To Revanth Reddy Details,

సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో అమలు చేసిన కొన్ని పథకాలు ఇప్పటికీ అమలవుతున్నాయి.ప్రజలకు మంచి పాలన అందించిన ముఖమంత్రులలో ఒకరిగా ఎన్టీఆర్ నిలిచిపోయారు.ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో మాత్రం ఎప్పటికీ జీవించే ఉంటారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సొంత పార్టీకి సంబంధించిన ప్రముఖ నేతల నుంచి ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు ఎదురయ్యాయి.

Shocking Facts About Telugu States Chief Ministers Ntr To Revanth Reddy Details,

అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరునవ్వుతో ఆ సవాళ్లను అధిగమించి పొలిటికల్ గా ఎదిగారు.ఏపీ సీఎం వైఎస్ జగన్ కు( CM YS Jagan ) కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.అయితే జగన్ మాత్రం ఒక్కో మెట్టు పైకి ఎక్కి 2019 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తెచ్చారు.2024 ఎన్నికల్లో సైతం వైసీపీని అధికారంలోకి తెస్తానని జగన్ నమ్మకంతో ఉన్నారు. ఏపీ సీఎం జగన్ పాలన గురించి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

వైసీపీని మరోమారు అధికారంలోకి తీసుకురావాలనే సీఎం జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు