కన్నడ స్టార్ హీరో కోసం బాలయ్య.. ఆ హీరో ఎవరంటే?

కేజిఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీపై అంచనాలు పెరిగి పోయాయి.కెజిఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ ఈ ఇండస్ట్రీ గురించి అందరికి తెలిసేలా చేసాడు.

ఇక ఈ మధ్య వచ్చిన కాంతారా సినిమా అయితే చిన్న బడ్జెట్ తో వచ్చి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.ఒక అప్పటి నుండి కన్నడ ఇండస్ట్రీ నుండి సినిమాలు వస్తున్నాయి అంటే వాటిపై అంచనాలు బాగా పెరుగు తున్నాయి.

తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.శివ రాజ్ కుమార్ 125వ సినిమా వేద.

ఇదే పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది.డైరెక్టర్ హర్ష తెరకెక్కించిన ఈ సినిమాలో ఘనవి లక్ష్మణ్ కథానాయికగా నటిస్తుంది.

Advertisement

గీతా పిక్చర్స్ ఇంకా జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమా గ్రాండ్ గా ఫిబ్రవరి 9, 2023న రిలీజ్ కానుంది.మరి రిలీజ్ డేట్ దగ్గరకు రావడంతో తెలుగులో కూడా ప్రమోషన్స్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నారు.

మరి ఈవెంట్ గురించి ఇప్పుడు అదిరిపోయే సమాచారం బయటకు వచ్చింది.ఈ ఈవెంట్ కోసం టాలీవుడ్ స్టార్ హీరో గెస్టుగా రాబోతున్నాడట.

ఇదే విషయాన్నీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.మరి గెస్టుగా రాబోతున్న హీరో ఎవరంటే.సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాబోతున్నాడు అని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.చూడాలి బాలయ్య వల్ల ఈ సినిమా తెలుగులో ఎన్ని కలెక్షన్స్ రాబడుతుందో.

Advertisement

తాజా వార్తలు