ఎక్కడ చూసిన 'జవాన్' మానియానే.. థియేటర్స్ లో ఊగిపోతున్న ఫ్యాన్స్!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్.

ఈ కాంబోలో సినిమా ప్రకటించగానే అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.

అందులోను షారుఖ్ పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ తో కొన్నేళ్ల తర్వాత ఫామ్ లోకి వచ్చాడు.ఇదే ఊపులో వెంటనే జవాన్ సినిమాను చేయడంతో ఈ సినిమా కూడా ఓ రేంజ్ లో అంచనాలతో రిలీజ్ అయ్యింది.

నిన్న కృష్ణాష్టమి సందర్భంగా వరల్డ్ వైడ్ గా జవాన్( Jawan Movie ) రిలీజ్ అవ్వడంతో అప్పటి నుండి థియేటర్స్ లో జవాన్ మానియా స్టార్ట్ అయ్యింది.మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.

షారుఖ్ కటౌట్ కు పాలాభిషేకాలు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు.ఎక్కడ షారుఖ్ జవాన్ మూవీ ఆడుతున్న థియేటర్ లో చుసిన ఫ్యాన్స్ గోల గోల చేస్తూ రచ్చ చేస్తున్నారు.వీరి హంగామా చూసి థియేటర్స్ సైతం బద్దలు అవుతున్నాయి.

Advertisement

ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ అవ్వగా ఇండియా వైడ్ గా 75 కోట్లు.వరల్డ్ వైడ్ గా 150 కోట్ల కలెక్షన్స్ దాటేసింది.

ఈ కలెక్షన్స్ చూస్తుంటే జవాన్ మానియా ఇప్పట్లో ఆగేలా లేదు.ముందు 1000 కోట్లు రాబడుతుంది అని టాక్ రాగా ఇప్పుడు 1500 కోట్లు వచ్చిన ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.ఇక ఇందులో దీపికా పదుకొనె కీ రోల్ పోషించింది.

అలాగే ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటెర్టైనమెంట్స్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్( Anirudh Ravichander ) మ్యూజిక్ అందించారు.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు