కింగ్ ఖాన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్.. 1000 కోట్ల క్లబ్ లో 'జవాన్'!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) సౌత్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్.

( Jawan ) ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 7న రిలీజ్ అయ్యింది.

ఇక రిలీజ్ రోజు నుండి కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది.షారుఖ్ ఖాన్ ఈ సినిమా కంటే ముందు పఠాన్ తో 1000 కోట్ల ప్రాజెక్ట్ ను బాలీవుడ్ కు అందించి అప్పటి వరకు తనపై వచ్చిన ట్రోల్స్ కు చెక్ పెట్టారు.

ఇక పఠాన్( Pathaan ) వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత షారుఖ్ సౌత్ డైరెక్టర్ అట్లీతో సినిమా ప్రకటించాడు.పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాక సౌత్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడంతో షారుఖ్ రిస్క్ తీసుకుంటున్నారేమో అనుకున్నారు.

కానీ జవాన్ అవుట్ పుట్ చూసిన తర్వాత కథ వేరేలా ఉంది.ఈ సినిమా పఠాన్ ను మించిన సక్సెస్ సాధించి షారుఖ్ ఖాన్ ను మరోసారి బాలీవుడ్ లో కింగ్ లా నిలబెట్టింది.

Advertisement

షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార ( Nayanthara ) హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ( Atlee ) 9 దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ జవాన్. ఈ సినిమా మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.జవాన్ సినిమాను లాజిక్ తో పని లేకుండా అట్లీ తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ క్రియేట్ చేసాడు.

మొదటి రోజు నుండి రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న జవాన్ ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల మార్క్ ను టచ్ చేసింది.

ఈ సినిమా తో షారుఖ్ 1004 కోట్ల రూపాయలను రాబట్టడంలో ఫ్యాన్స్ సంతోషం అంత ఇంత కాదు.వరుసగా ఒకే ఏడాదిలో కేవలం 7 నెలల తేడాతో రెండు వెయ్యి కోట్ల సినిమాలు సాధించడం తేలికైన విషయం కాదు.మరి బాలీవుడ్ కింగ్ ఖాన్ కే ఇలాంటి ఘనత దక్కింది.

ఇక పఠాన్, జవాన్ రెండు సినిమాలు 1000 కోట్లను సాధించడంతో నెక్స్ట్ రాబోతున్న డంకీ సినిమాపై మరిన్ని హోప్స్ పెరిగాయి.మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు