మహేష్ బాబుకు తల్లిగా వెటరన్ హీరోయిన్.. ఎవరంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాను త్వరగా పట్టాలు ఎక్కించాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.ఇకపోతే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు.ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Advertisement
Senior Heroine Radha Play Mahesh Babu Mother Upcoming Movie, Mahesh Babu, Trivik

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఈ సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్ర కోసం ఒక స్టార్ హీరోయిన్ ఎంపిక చేశారట.

అయితే ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు రాధ.ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన రాధ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించ నుందట.ఈ సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్ర కోసం ఇప్పటికే మూవీమేకర్స్ ఆమెను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Senior Heroine Radha Play Mahesh Babu Mother Upcoming Movie, Mahesh Babu, Trivik

ఇక అప్పట్లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆమె ఆ తర్వాత నటనకు గుడ్ బై చెప్పింది.తాజాగా ఈ సినిమాతో మరోసారి వెండితెరపై కి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలో ఎక్కువగా సీనియర్ హీరోయిన్ లకు అవకాశాలు ఇస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కి అత్తయ్య పాత్రలో నదియా, అజ్ఞాతవాసి సినిమాలో కుష్బూ, అలా వైకుంఠపురం సినిమాలో టబుకు అవకాశాలు ఇచ్చారు.మరి రాధ ఈ సినిమాలో నటించ నుందా లేదా తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు