సొంత పార్టీ చేతుల్లో ట్రంప్ భవితవ్యం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి మరీ ఘోరంగా మారింది.అభిశంసన పెట్టింది మొదలు ట్రంప్ ని డెమోక్రటిక్ పార్టీ రాజకీయంగా తెగ వాడేసుకుంటోంది.

ఈ క్రమంలోనే సెనేట్ ముందుకు విచారణకి వెళ్ళిన ట్రంప్ అభిశంసన నేగ్గుతుందో లేదో కాని, ఇలా విచారణ ఎదుర్కుంటున్న మూడో అధ్యక్షుడు ట్రంప్ అంటూ రచ్చ రచ్చ చేస్తోంది.ఇదిలాఉంటే ట్రంప్ పై అభిశంసన రెండు వారాల్లో తెలిపోనుందని అంటున్నారు పరిశీలకులు.

గత అధ్యక్షుడు బిల్ క్లింటన్ 1999లో అభిశంసన ఎదుర్కున్న సమయంలో సుమారు ఐదు వారాల సమయం పట్టిందట.అలాగే ఆండ్రూ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సుమారు ఈ విచారణ మూడు నెలలు పట్టిందని, ట్రంప్ కి కేవలం రెండు వారాలు మాత్రమే చాలానే వార్తలు వినిపిస్తున్నాయి.

ఒక పక్క అధ్యక్ష భవనం , మరో పక్క సెనేట్ ఏకాభిప్రాయంతో ఉంటే గనుకా రెండు వారాలలో తేలిపోతుందని తెలుస్తోంది.

Advertisement

ట్రంప్ పై మోపిన ఈ అభిశంసన బిల్లు రిపబ్లికన్ లు అధికంగా ఉండే సెనేట్ లో ఆమోదం పొందాలంటే తప్పకుండా వారిలో కొంతమంది తిరస్కరించాల్సి ఉంటుంది.మరి రిపబ్లికన్ నేతలు ట్రంప్ కి మద్దతు ఇస్తారా లేదా మళ్ళీ ట్రంప్ పాలన కావాలని అనుకుంటారో లేదో అనేది త్వరలో సెనేట్ అభిశంసన లో తేలిపోనుందని అంటున్నారు.అంటే ట్రంప్ భవితవ్యం సొంత పార్టీ చేతులో ఉందన్నమాట.

ట్రంప్‌ కోసం వైట్‌హౌస్ ఉద్యోగులను ఎలా ఎంపిక చేస్తుందంటే?
Advertisement

తాజా వార్తలు