SBI కొత్త రూల్ తెలుసా? ఈ యాప్ మీరు వాడుతున్నారా? అయితే ఇవి ఫాలో అవ్వండి!

RBI ఆదేశాల మేరకు SBI తాజాగా కొత్త రూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.బ్యాంకులన్నీ చెక్కుల క్లియరెన్స్ కోసం పాజిటీవ్ పే సిస్టమ్ పాటిస్తున్న విషయం తెలిసినదే.

రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన ఉన్న చెక్స్ ఎన్‌క్యాష్ చేయాలంటే పాజిటీవ్ పే సిస్టమ్ పాటించాలనే విషయం మీకు తెలుసు.అయితే ఆగస్ట్ 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి రానున్నాయి.కస్టమర్లు పాజిటీవ్ పే సిస్టమ్ పాటించకుండా రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన చెక్స్ ఇస్తే బ్యాంకు వాటిని వెనక్కి పంపే అవకాశం లేకపోలేదు.కస్టమర్లు ఎవరికైనా చెక్ ఇచ్చినప్పుడు ఆ వివరాలను బ్యాంకుకు తప్పకుండా తెలియజేయాలి.

SMS, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM ద్వారా బ్యాంకుకు సదరు సమాచారాన్ని అందించవచ్చు.SBI కస్టమర్లు ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్‌లో సులువుగా తాము ఇచ్చిన చెక్ వివరాలను బ్యాంకుకు తెలియపరచవచ్చు.

ఇక మొబైల్ యాప్ ద్వారా వివరాలను ఎలా తెలపాలో కొన్ని స్టెప్స్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందామా? 1.SBI కస్టమర్లు ముందుగా యోనో SBI యాప్ డౌన్‌లోడ్ చేయాలి.2.తరువాత తమ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.3.ఆ తర్వాత యోనో SBI యాప్‌లో లాగిన్ కావాలి.4.లెఫ్ట్ కార్నర్‌లో మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.5.తర్వాత Service Request ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

6.ఆ తర్వాత Positive Pay System పైన క్లిక్ చేసి ఆ తర్వాత Make a Request ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.7.View Request ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు సబ్మిట్ చేసిన చెక్ వివరాలు ఉంటాయి.చెక్ తేదీ, చెక్ అమౌంట్, బెనిఫీషియరీ పేరు లాంటి వివరాలన్నీ ఎంటర్ చేసి తర్వాతి స్టెప్‌లోకి వెళ్లాలి.8.నియమనిబంధనలన్నీ అంగీకరించిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓ OTP వస్తుంది.9.OTP ఎంటర్ చేస్తే మీరు ఎంటర్ చేసిన వివరాలు బ్యాంకుకు సబ్మిట్ అవుతాయి.

గమనిక:

యోనో SBI యాప్‌లో ఫాలో అయిన స్టెప్స్ యోనో లైట్ యాప్‌లో కూడా ఫాలో అవొచ్చు.500000 కన్నా ఎక్కువ చెక్ వేసేవాల్లు ఈ రూల్స్ తప్పక పాటించాలి.

Advertisement
ఇక మూడు రోజులే.. అలాంటివారు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాల్సిందే..

తాజా వార్తలు