సినిమాపై ఉన్న కమిట్మెంట్ చూపించిన సత్యదేవ్... ట్విట్టర్ లో పేరు మార్పు

టాలీవుడ్ లో హీరోలు ఎంత మంది ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే నటులుగా ఒక స్థాయి గుర్తింపు ఉంటుంది.

అలా టాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్స్ అనిపించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ స్టార్ హీరోలు అయిన కూడా గొప్ప నటులు అనిపించుకోలేకపోయారు.అలాగే చాలా మందికి స్టార్ హీరో ఇమేజ్ ఉన్న గొప్ప నటులు అనే గుర్తింపు మాత్రం చాలా ఆలస్యంగా వచ్చింది.

రామ్ చరణ్ కి కూడా నటుడుగా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి రంగస్థలం సినిమా వరకు ఎదురుచూడాల్సి వచ్చింది.అయితే కమర్షియల్ జోనర్ లో పడి స్టార్ హీరోలు తమలోని పూర్తి స్థాయి నటుడుని ఎక్కువగా బయట పెట్టరు.

అయితే కమర్షియల్ జోనర్ కి దూరంగా ఉండే హీరోలు మాత్రం తమలోని నటుడుని ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరిస్తూ ఉంటారు.ఇలాంటి నటుల జాబితా చూసుకుంటే కమల్ హసన్, విక్రమ్, సూర్య, కార్తి లాంటి తమిళ హీరోల జాబితా ఎక్కువగా కనిపిస్తుంది.

Advertisement

ఇక తెలుగులో ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, నాని లాంటి హీరోలు ఈ జెనరేషన్ లో తమ నటనలో వైవిధ్యం చూపిస్తున్నారు.ఇప్పుడు ఇదే దారిలోకి మరో టాలెంటెడ్ నటుడు వచ్చి చేరాడు.

అతడే సత్యదేవ్.పూరి పరిచయం చేసిన ఈ హీరో తనలోని నటుడుని ఆవిష్కరించుకొని విమర్శకుల ప్రశంసలు పొందడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.బ్లఫ్ మాస్టర్ సినిమాతో నటుడుగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

తాజాగా మలయాళీ రీమేక్ గా వచ్చిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మరో సారి తన నటనలో వైవిధ్యం చూపించి తాను ఎంత బెస్ట్ యాక్టరో అనే విషయాన్ని ప్రూవ్ చేసుకున్నాడు.ఇక సినిమా అంటే తనకున్న కమిట్మెంట్ ని సత్యదేవ్ ప్రతి సందర్భంలో బయట పెడుతూనే ఉంటాడు.

తాజాగా తన ట్విట్టర్ ఎకౌంటు పేరు ఉమామహేశ్వరరావు అని మార్చేసి ఆ పాత్ర మీద తనకున్న పాషన్ చూపించుకున్నాడు.ప్రస్తుతం తమన్నాతో కలిసి సత్యదేవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
ఆ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న సమంత.. అక్కడ సక్సెస్ కావడం సాధ్యమేనా?

మరో వైపు వెబ్ సిరీస్ లతో అలరిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు