సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుటోంది.
ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయిన ఈ చిత్ర షూటింగ్, తాజాగా సాంగ్స్ షూట్ జరుపుకుంటోంది.
కాగా తాజాగా ఈ సినిమాలో నుండి ‘సూర్యుడివో చంద్రుడివో’ అనే పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.ఈ పాట యూట్యూబ్‌లో రచ్చ చేస్తోంది.
రామజోగయ్య శాస్త్రి అందించిన చక్కటి లిరిక్స్‌కు దేవిశ్రీ ప్రసాద్ మెలోడితో కూడిన బాణీలు అందించాడు.బి ప్రాక్ పాడిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నడుస్తోంది.
విజయశాంతి కుటుంబానికి అండగా నిలిచే మహేష్ బాబు పాత్రను పొగుడుతూ ఈ పాట సాగుతోంది.యూట్యూబ్‌లో ఈ పాట రికార్డు వ్యూస్ సాధిస్తోంది.
ఈ పాట రిలీజ్ అయిన 24 గంటల లోపే రెండున్నర మిలియన్ వ్యూస్ సాధించింది.ఈ పాటతో యూట్యూబ్ పాత రికార్డులను మహేష్ బద్దలు కొట్టడం ఖాయమని తెలుస్తోంది.
పూర్తి ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన నటిస్తోండగా లేడీ అమితాబ్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోంది.అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy