సాయి పల్లవి, చైతూ లవ్ స్టొరీని రివీల్ చేస్తున్న సమంత

తెలుగులో క్రేజీ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల భామ సాయి పల్లవి.ఏకంగా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని టాలీవుడ్ లో కలిగి ఉన్న ఈ అమ్మడు సినిమా కోసం చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు.

ప్రస్తుతం ఈ భామ రానాతో విరాటపర్వం సినిమా చేస్తుంది.అలాగే నాగ చైతన్యతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీ సినిమా చేసింది.

ఈ రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాల నుంచి ఒక్కొక్కటిగా సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి.

ఇప్పటికే లవ్ స్టొరీ నుంచి రెండు సాంగ్స్ ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.ఈ రెండు సాంగ్స్ మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.

Advertisement

తాజాగా విరాటపర్వం నుంచి సాయి పల్లవికి సంబంధించిన సోలో సాంగ్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది.మెలోడియస్ గా ఉన్న ఈ సాంగ్ కి యుట్యూబ్ లో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే లవ్ స్టొరీ నుంచి మరో పాటని లాంచ్ చేయడానికి శేఖర్ కమ్ముల రెడీ అయ్యాడు.ఈ సినిమాలో సారంగ దరియా అంటూ సాగే ఈ సాంగ్ ని స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా ఈ నెల 28న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.

భర్త సినిమాలని దగ్గరుండి ప్రమోట్ చేసే సమంత ఇప్పుడు ఆ బాద్యతని లవ్ స్టొరీ విషయంలో కూడా తీసుకుందని తెలుస్తుంది.ఈ సాంగ్ లో సాయి పల్లవి డాన్సింగ్ స్కిల్ల్ ని చూపించబోతున్నట్లు తెలుస్తుంది.

మొత్తానికి ఒక టాలెంటెడ్ హీరోయిన్ కి సంబందించిన సాంగ్ ని మరో టాలెంటెడ్ స్టార్ హీరోయిన్ రిలీజ్ చేయభోతుండటం ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు