ఆన్ లైన్ లో యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్న సమంత! ఇప్పుడు ఎందుకో

సౌత్ లో స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటికే నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది.

స్టార్ హీరోలందరితో జత కట్టి కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ కావడంతో పాటు, రంగస్థలం, ఓ బేబీ సినిమాల ద్వారా నటిగా కూడా మంచి మార్కులు వేయించుకుంది.

సమంతని ఎవరైనా బెస్ట్ యాక్టర్ అని అనాల్సిందే.యాక్టింగ్ పరంగా ఆమెకి వంకలు పెట్టె వారు ఎవరూ ఉండరు.

Samantha Take Online Acting Training Classes, Tollywood, Telugu Cinema, Akkineni

అయితే ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మడు కొత్తగా ఆన్ లైన్ లో యాక్టింగ్ కి సంబంధించి శిక్షణ తీసుకుంటుంది.సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మంచి ట్రాక్ రికార్డు సొంతం చేసుకొని దశాబ్దంకి పైగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా తన బ్రాండ్ చూపిస్తూ వస్తున్న సమంతకి ఇప్పుడు కొత్తగా యాక్టింగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనే డౌట్ చాలా మందికి వస్తుంది.

అయితే ఆమెని మంచి నటి కాదని ఎవరైనా అన్నారో, ఏమో తెలియదు కాని ఉన్నపళంగా ఆన్ లైన్ లో యాక్టింగ్ తరగతులకి హాజరుకావడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే విషయం ఎవరికీ అర్ధం కావడం లేదు.అయితే తాను యాక్టింగ్ తరగతులకి హాజరవుతున్నట్లు ఆమెనే స్వయంగా వెల్లడించింది.

Advertisement

ఇకపై మంచి నటిని అనిపించుకుంటాను.ఒకవేళ అలా అనిపించుకోకపోతే కనుక ఈ పోస్టుని డిలీట్ చేస్తా అంటూ ఇంటరెస్టింగ్ గా పోస్ట్ కూడా పెట్టింది.

ఆమె పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారడంతో పాటు, ఆమె ఎందుకు ఇప్పుడు యాక్టింగ్ మళ్ళీ నేర్చుకుంటుంది అనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో పెరిగింది.మరి దానికి సమంత సమాధానం ఇస్తుందేమో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు