పెదరాయుడు సినిమా హిట్ కి సాయి కుమార్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?

సాయి కుమార్. హీరో గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అనేక రంగంలో అద్భుతంగా రాణిస్తున్న మల్టీ టాలెంటెడ్ యాక్టర్.

ఎంత పెద్ద స్టార్ అయినా కూడా సాయి కుమార్ డబ్బింగ్ జత కలిస్తే అత్యద్భుతంగా మారుతుంది.సాయి కుమార్ తండ్రి ఫై జె శర్మ కూడా నటుడు మరియు కంచు కంఠం తో డబ్బింగ్ చెప్పేవారు.

అయన గొంతు తన ముగ్గురు కుమారులకు కూడా వచ్చింది.సాయి కుమార్ తో పాటు రవి శంకర్ కూడా మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కెరీర్ లో దూసుకుపోతున్నాడు.

అమ్మ బొమ్మాలి అంటూ అరుంధతి సినిమాలో సోను సూద్ కి చెప్పినా డబ్బింగ్ కి ఇప్పటికి రోమాలు నిక్కపొడుస్తాయి.అంతలా తన గొంతు తో మెస్మరైజ్ చేసారు.

Advertisement

ఇక సాయి కుమార్ చిన్న తమ్ముడు అయ్యప్ప ఇటీవల కెజిఎఫ్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు.సినిమాల్లో వీరు ముగ్గురు డబ్బింగ్ తో బాగా ప్రాధాన్యం సంపాదించుకుంటున్నారు.

ఇక సాయి కుమార్ తెలుగు నుంచి హిందీ వరకు చాల మంది సీనియర్స్ కి డబ్బింగ్ చెప్తూ ఉంటారు.సుమన్, రాజశేఖర్ వంటి తెలుగు హీరోలకే కాకుండా, అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, మమ్మోట్టి వంటి స్టార్స్ కి తెలుగు లో డబ్బింగ్ చెప్తూ ఉన్నారు.

వారికి ఇప్పటికి కూడా సాయి కుమార్ గాత్రం లేకుండా తెలుగులో సినిమా ఇవ్వరు.

ఇక రజినీకాంత్ లాంటి స్టార్ తెలుగు లో నేరుగా చేసిన సినిమాల్లో కూడా సాయి కుమార్ తన గాత్రం ఇచ్చారు.అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెదరాయుడు.ఈ చిత్రం చాల పెద్ద హిట్ అయ్యింది.చరిత్రలో నిలిచిపోయే రికార్డులను బద్దలు కొట్టింది.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

అయితే ఈ సినిమాలో పాపా రాయుడు పాత్ర లో రజిని కాంత్ నటించి ఆ సినిమా వేల్యూ పెంచడమే కాదు.రజినీకాంత్ గొంతులో సాయి కుమార్ గాంభీర్యం కూడా ఆ పాత్రకు ఆయువు పట్టు.

Advertisement

పేద రాయుడు సినిమా ఇప్పటికి టీవీ లో వచ్చిన రజినీకాంత్ గారి కోసం, అయన చెప్పే డైలాగ్స్ కోసం చూసే వారు చాల మంది ఉంటారు.అంతలా సాయి కుమార్ ఎందరో బయట నటులను మన తెలుగు వారికి చేరువ చేసాడు.

తాజా వార్తలు