వకీల్ సాబ్'లా అవ్వకూడదని ఓటిటికి ఇచ్చేశారట !

ప్రెసెంట్ నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ముంగించుకుని విడుదలకు సిద్ధం చేసాడు.

ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.ఈ సినిమా శివ నిర్వాణ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.

ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమా ఏప్రిల్ లోనే విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

ఇక ఈ సినిమా ఇప్పుడు డైరెక్ట్ ఓటిటీ లోనే విడుదల అవ్వబోతుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా త్వరలోనే స్ట్రీమింగ్ కు రాబోతుంది.

Advertisement
Sahu Garapati Responding On Tuck Jagadish Movie Ott Release,sahu Garapati, Ott R

అయితే ఓటిటి రిలీజ్ అన్నప్పటి నుండి ఈ సినిమాపై విమర్శలు వస్తున్నాయి.ఈ సినిమాను నిర్మించిన నిర్మాతను నాని అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శించడం చూస్తూనే ఉన్నాం.

Sahu Garapati Responding On Tuck Jagadish Movie Ott Release,sahu Garapati, Ott R

నాని ఈ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయాలని చాలా ట్రై చేసారు.కానీ నిర్మాతల ఆర్ధిక కష్టాల కారణంగా ఈ సినిమాను ఓటిటి లో విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారు.తాజాగా ఈ విషయంపై నిర్మాత సాహు గార్లపాటి వివరించాడు.

ఈ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయాలనీ అనుకున్నాంకానీ థర్డ్ వేవ్ పరిస్థితుల్లో జనాలు థియేటర్స్ కు రావడానికి భయపడుతున్నారు.

Sahu Garapati Responding On Tuck Jagadish Movie Ott Release,sahu Garapati, Ott R

అందుకే థియేటర్స్ లో సినిమా విడుదల చేయాలంటే రిస్క్ అని భావించాం.అప్పట్లో వకీల్ సాబ్ సినిమా విడుదల అయ్యి మంచి టాక్ వచ్చినా కానీ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ మూత పడడంతో కలెక్షన్లకు గండి పడింది.అలంటి పరిస్థితి మళ్ళీ వస్తే చాలా ఇబ్బంది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

అందులోను ఇంకా కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్స్ ఓపెన్ చెయ్యలేదు.ఒవెర్సీస్ లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది.

Advertisement

ఏపీ లో కూడా ఇంకా మూడు షోలే నడుస్తున్నాయి.వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని టక్ జగదీశ్ సినిమాను ఓటిటి లోనే విడుదల చేయాలనీ అనుకున్నాం అని నిర్మాత తెలిపారు.

ఇప్పటి వరకు పరిస్థితులు మాములుగా మారుతాయని ఎదురు చూసాము.కానీ ఇంకా ఎక్కువ రోజులు వేచి చూడలేక ఓటిటి కి ఇచ్చామని సాహు గార్లపాటి తెలిపారు.

తాజా వార్తలు