S.P. Balasubramanyam: సింగర్ బాలసుబ్రమణ్యం పాటలు పాడకూడదని ఆ హీరో క్షుద్ర పూజలు చేయించారా..?

స్టార్ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ( S.P.Balasubramanyam ) ప్రస్తుతం మన ముందు లేకపోయినప్పటికీ ఆయన పాటల ద్వారా ఎప్పటికీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా మిగిలే ఉంటారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు దాదాపు 40 వేలకు పైగా పాటలు ఆలపించి ఇండియా మొత్తంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న సింగర్ గా మారిపోయారు.

ఈయన కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ,హిందీ, కన్నడ భాషల్లో కూడా పాటలు పాడి అక్కడ కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇక ఈయన పాడిన పాటలకు గానూ పద్మభూషణ్, పద్మ శ్రీ ( Padma Sri) అలాగే ఆయన చనిపోయాక పద్మ విభూషణ్ వంటి అవార్డులతో ఈయనను అభినందించారు.

ఇక అలాంటి గొప్ప సింగర్ కి ఓ నటుడు క్షుద్ర పూజలు చేయించారు అంటూ గతంలో ఒక వార్త చక్కర్లు కొట్టింది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.సింగర్స్ అన్నాక అప్పుడప్పుడు వారి గొంతుకు ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతూనే ఉంటుంది.ఇక 40 వేల పాటలు పాడిన బాలసుబ్రమణ్యం ( Balasubramanyam) గొంతుకు కూడా గతంలో ఇబ్బంది వచ్చిందట.

Advertisement

గొంతు నొప్పి ఉండడంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు గొంతు సర్జరీ చేయించుకోవాలి.లేకపోతే ఇప్పటి నుండి పాటలు పాడలేరు అని చెప్పేసరికి ఆయన ఆ మాటలని పట్టించుకోకుండా ఇంటికి వచ్చి ఇలాంటి మాటలు ఎప్పుడూ చెప్పేవే.

ఇప్పుడు నాకు అంత అవసరం లేదు.నేను ఎలాగైనా పాడగలను అని గీతాంజలి ( Geethanjali ) సినిమాకి పాటలు పాడడానికి ఒప్పుకున్నారట.అయితే ఈ సినిమాలో "ఓ పాపా లాలి" అనే పాట పాడడం కోసం నానా కష్టాలు పడ్డారట.

అంతేకాదు ఒక్క రోజులో పూర్తి చేసే పాట కోసం నాలుగు రోజుల సమయం తీసుకున్నారట.అంతే కాకుండా పాట మొదలుపెట్టి ఒక లైన్ పాడక ముందే ఎంతో అవస్థ పడ్డారట.

దాంతో ఇంటికి వచ్చాక బాలసుబ్రమణ్యం ( Balasubramanyam )ఇబ్బంది పడుతుంటే చూసి ఆయన సతీమణి ఏంటండీ ఇన్ని పాటలు పాడిన మీ గొంతు ఇలా అయిపోయింది ఈ మధ్యకాలంలోనే ఓ స్టార్ హీరోతో తగాదాలు పెట్టుకున్నారు అని నాతో చెప్పారు ఆ హీరో ఏమైనా మీపై క్షుద్ర పూజలు చేయించారా ఏంటి? నాకు అనుమానంగా ఉంది అంటూ అడిగేసిందట.ఇక భార్య మాట్లాడిన మాటలకు మనసులో నవ్వుకున్న బాలసుబ్రమణ్యం ( Balasubramanyam ) అలాంటిదేమీ లేదు గొంతుకు మేజర్ సర్జరీ చేయించుకోవాలంట లేకపోతే పాటలు పాడడం ఇబ్బంది అవుతుందట అని చెప్పారట.ఇక ఈ విషయాన్ని బాలసుబ్రమణ్యం ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

అలాగే కొన్ని రోజులకి గొంతుకి మేజర్ సర్జరీ చేయించుకొని ఎప్పటిలాగే పాటలు పాడారు.

Advertisement

తాజా వార్తలు