ఒక్కొక్కసారి మనకు అనుకోని ప్రతికూల పరిస్ధితులు ఎదురవుతాయి.ఊహించని ప్రమాదాలు మనకు ఎదురవుతూ ఉంటాయి.
ఇలాంటి సమయంలో కొంతమంది ప్రమాదాల బారిన పడతారు.ఇక మరికొంతమంది ఊహించని పరిణామాలు ఎదురైనప్పుడు తమ చాకచక్యంతో బయటపడుతూ ఉంటారు.
తమ తెలివి ఉపయోగించి ప్రమాదం నుంచి బయటపడతారు.తాజాగా ఒక పూజారి( Temple priest )కి ఊహించని అనుభవం ఎదురవ్వగా తెలివి ఉఫయోగించి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక పూజారి పొద్దున్నే గుడికి వెళ్లాడు.పూజారి గుడిలో ఉండగా రెండు సింహాలు లోపలికి చొరబడ్డాయి.గుజరాత్( Gujarat ) లోని గిర్ గ్రామంలోని పాండేశ్వరి మహాదేశ్ ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పూజారి పొద్దున్నే గుడిలో పూజలు చేస్తుండగా రెండు సింహాలు లోపలికి వచ్చేశాయి .దీంతో వాటిని చూసి తలుపులను మూసేశాడు పూజారి.ఈ సింహాలను తన ఫోన్ లో వీడియో తీశాడు.ఒక సింహాం దగ్గరకు వస్తుండగా గట్టిగా కేకలు వేశాడు.ఆ కేకలకు సింహాలు కూడా వెనక్కి వెళ్లాయి.కొద్దిసేపటికి రెండు సింహాలు కూడా గుడి లోపల నుంచి బయటకు వెళ్లడంతో పూజారి ఊపిరిపీల్చుకున్నాడు.

అభ్యాసింగ్ అనే వ్యక్తి దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా( Social media )లో షేర్ చేశాడు.దీంతో అది కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియోకు లక్షకుపైగా వ్యూస్ రాగా.53 వేల మందికిపైగా లైక్ చేశారు.అయితే గిర్ ప్రాంతాల్లో తరచుగా సింహాలు కనిపిస్తూ ఉంటాయని చెబుతున్నారు.అలాగే ఈ పూజారి ధైర్యాన్ని అందరూ మొచ్చుకుంటున్నారు.ఈ పూజారి ధైర్యానికి హ్యాట్సఫ్ చెప్పాల్సిందేనని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.ఈ పూజారికి సింహాలు అంటేనే భయం లేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
ఇలా నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు కామెంట్స్ పెడుతున్నారు.







