ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగడంతో రష్యాపై నాటో దేశాలు( NATO ) ఆంక్షలు విధించిన సంగతి అందరికీ విదితమే.ఈ తరుణంలో రష్యాకు చైనా( China ) నుంచి సహకారం అందించిందని అమెరికా నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి.
చైనా రష్యాకు టెక్నాలజీతో పాటు అనేక పరికరాలు అందించినట్లు అమెరికా నిఘా విభాగం ఓ నివేదికలో పేర్కొంది.గత ఏడాది ఫిబ్రవరిలో మాస్కో ఉక్రెయిన్‌పై ( Ukraine ) దాడి చేసినప్పటి నుంచి చైనా.
రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతిని పెంచింది.రష్యా 2021తో పోలిస్తే 2022లో చైనాకు 2 రెట్లు ఎక్కువ మొత్తంలో పెట్రోలియంను ఎగుమతి చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.రష్యా నుంచి చైనా ముడి చమురు దిగుమతులు మార్చిలో రోజుకు 1.65 మిలియన్ బ్యారెళ్లను తాకాయి.ఈ నేపథ్యంలో బీజింగ్ రష్యా క్రూడ్‌ను భారీ మొత్తంలో కొనుగోలు చేసింది.

నాటో దేశాలు రష్యాపై( Russia ) ఆంక్షాలు విధించిన తర్వాత.ఆ దేశానికి చైనానే అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా మారడం ఇపుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది.ఇదే విషయం చాలా దారుణంగా ఉందని అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ పేర్కొంది.
ఆ నివేదిక ప్రకారం వారు ఏం చెబుతున్నారంటే, “రష్యా యుద్ధ ప్రయత్నాలకు ఇపుడు చైనా కీలక పాత్ర పోషిస్తోంది.ఉక్రెయిన్‌లో ఉపయోగించే ద్వంద్వ వినియోగ పరికరాలలో కీలకమైన సాంకేతికతను మాస్కోకు చైనానే సరఫరా చేస్తుందనే విషయం మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది!” అని నివేదిక పేర్కొంది.

ఇంకా అనేక విషయాలు ఆ నివేదిక తేటతెల్లం చేసినట్టు తెలుస్తోంది.చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని రక్షణ సంస్థలు రష్యా రక్షణ సంస్థలకు నావిగేషన్ పరికరాలు, ఫైటర్ జెట్‌ల విడిభాగాలు, ఇతర డ్యూయల్ యూజ్ టెక్నాలజీని రవాణా చేశాయని నివేదిక ద్వారా తెలిసింది.మార్చి నాటికి, చైనా 12 మిలియన్ డాలర్లకు పైగా డ్రోన్లు, డ్రోన్ భాగాలను రష్యాకు రవాణా చేసినట్టు కూడా తెలుస్తోంది.చైనా, హాంకాంగ్ లోని చిరు వ్యాపారుల నుంచి భారీగ కొనుగోలు చేసిన చైనా, వాటిని రష్యాకు పంపినట్లు అమెరికా నిఘా విభాగం తెలిపింది.
ఉక్రెయిన్‌లో యుద్ధం కోసం రష్యాకు ఆయుధాలను పంపవద్దని బిడెన్ ప్రభుత్వం( Joe Biden ) చైనాను హెచ్చరించింది.







