ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ( Swiggy ) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ యాప్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.
ఫుడ్ డెలివరీతో పాటు ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులు, కూరగాయలు, వివిధ ఇంట్లోకి అవసరమయ్యే వివిధ వస్తువులను నిమిషాల్లోనే డెలివరీ చేస్తారు.దీంతో స్విగ్గీ బాగా పాపులర్ అయింది.
అయితే స్విగ్గీ ఎప్పటికప్పుడు తమ యూజర్లను పెంచుకునేందుకు అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.ఇప్పటికే స్విగ్గీ పేమెంట్ పేరుతో ఒక ఫీచర్ ను తీసుకొచ్చింది.
దీని వల్ల గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే లాంటి యాప్స్ అవసరం లేకుండా నేరుగా స్విగ్గీ పేమెంట్స్ ద్వారా డబ్బులు చెల్లించవచ్చు.

అయితే ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను స్విగ్గీ అందుబాటులోకి తెచ్చింది.అదే స్విగ్గీ క్రెడిట్ కార్డు( Swiggy Credit Card ).దీని ద్వారా ఆన్ లైన్ లోని ఫుడ్ ఆర్డర్లపై తగ్గింపు ఇవ్వనుంది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో ( HDFC Bank )కలిసి స్విగ్గీ ఈ క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది.ఈ క్రెడిట్ కార్డు వల్ల సుమారు సంవత్సరానికి రూ.42 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.అలాగే ఇతర ఖర్చులపై కూడా 1 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది.
అలాగే స్విగ్గీ వన్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.స్విగ్గీ వన్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా ఫుడ్, ఇన్‌స్టామార్ట్, స్విగ్గీ జెనీ డెలివరీలపై ఉచిత డెలివరీలు పొందవచ్చు.

స్విగ్గీ యాప్ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్ సైట్ ద్వారా ఈ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ క్రెడిట్ కార్డు జాయినింగ్ ఫీజు రూ.500 ఉండగా.ఒకవేళ ఒక ఏడాదిలో రూ.2 లక్షలకుపైగా ఖర్చు చేస్తే జాయినింగ్ ఫీజును వెనక్కి ఇస్తారు.అలాగే హోటళ్లు, రిసార్ట్ లో ఒక రాత్రి బస, భోజనం ఉచితంగా కల్పిస్తారు.
మీరు ఖర్చు చేసిన వాటికి ప్రతి నెల 10వ తేదీన స్విగ్గీ మనీ అకౌంట్ లో క్యాష్ బ్యాక్ క్రెడిట్ అవుతుంది.







