RRR రెస్టారెంట్స్.. ముగ్గురు కలిసి కొత్త ప్లాన్ లో ఉన్నారా.. అసలేం జరుగుతుంది?

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.

ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టారు.ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు.

అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

Advertisement
Rrr Restaurants Coming Soon-RRR రెస్టారెంట్స్.. మ�

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.టాక్ తో పని లేకుండానే బాక్సాఫీస్ కలెక్షన్ల ను కొల్లగొట్టింది.

సినిమా ఇంత ఘన విజయం సాధించడంతో వీరి కాంబో కూడా సూపర్ హిట్ అయ్యింది.

Rrr Restaurants Coming Soon

అయితే ఈ ముగ్గురు కలిసి మరొక కొత్త వ్యాపారంలోకి దిగబోతున్నారట.బాహుబలి తర్వాత బాహుబలి పేరుతొ టాయ్స్ అని టీ షర్ట్స్ అని ఇలా చాలా మార్కెట్ లోకి వచ్చాయి.ఇక ఇప్పుడు అదే తరహాలో వీరి ముగ్గురుతో రెస్టారెంట్స్ బిజినెస్ ను స్టార్ట్ చేయబోతున్నారట.

RRR బ్రాండ్ తో రెస్టారెంట్ చైన్ వ్యాపారాన్ని స్టార్ట్ చేసేందుకు ప్రముఖ నిర్మాత సరికొత్త ఆలోచనతో ఈ స్టార్స్ ను సంప్రదించినట్టు టాక్ వినిపిస్తుంది.

Rrr Restaurants Coming Soon
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

అయితే ఇది ఎంత వరకు ముందుకు వెళుతుందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ అయ్యింది.ఈ ముగ్గురు వ్యాపారంలోకి అడుగు పెట్టారంటే దానయ్య కూడా జాయిన్ కావాల్సి ఉంటుంది.ఎందుకంటే ఈ టైటిల్ పై సర్వహక్కులు ఈయనకే ఉన్నాయి.

Advertisement

ప్రెసెంట్ ఈ ఆలోచన ఇంకా మాటల్లోనే ఉందని తెలుస్తుంది.ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలంటే అందుకు ఈ ముగ్గురు స్టార్స్ సమయం కేటాయించాలి కానీ వీరు వరుస సినిమాలతో బిజీగా ఉంటారు కాబట్టి ఇది ఎంత వరకు ముందుకు వెళుతుందో తెలియదు.

తాజా వార్తలు