ఆర్ఆర్ఆర్ ఆ జిల్లాలో మాత్రం భారీ నష్టాలను మిగిల్చిందా.. ఎంత నష్టమంటే?

ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికే మెజారిటీ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిన సంగతి తెలిసిందే.

థియేటర్ల సంఖ్య తగ్గినా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయని తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఈ సినిమాను 50 రోజుల పాటు ప్రదర్శించనున్నారని బోగట్టా.తాజాగా మేకర్స్ స్పందించి ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారనే సంగతి తెలిసిందే.

ఓటీటీలో ఈ సినిమాను చూడాలనుకునే ప్రేక్షకులు చాలా సమయం వేచి ఉండక తప్పదు.అయితే ఏపీలోని వెస్ట్ గోదావరిలో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదని సమాచారం అందుతోంది.

ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ కు కోటి రూపాయలకు అటూఇటుగా నష్టం వచ్చిందని సమాచారం అందుతోంది.అయితే ఈ సినిమా నిర్మాతలకు భారీగా లాభాలను అందించిన నేపథ్యంలో నిర్మాతలు ఆ నష్టాలను భర్తీ చేస్తారేమో చూడాల్సి ఉంది.

Advertisement

నిర్మాతలు ఊహించని మొత్తానికి హక్కులను విక్రయించడం వల్లే పలు ఏరియాల్లో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని సమాచారం.

ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్టైనా కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో లాభాలను అందించలేదు.భారీ బడ్జెట్ తో తెరకెక్కడం కరోనా వల్ల వడ్డీల భారం పెరగడంతో నిర్మాతలపై, డిస్ట్రిబ్యూటర్లపై భారం పెరిగింది.

మరోవైపు ఆర్ఆర్ఆర్ సక్సెస్ వల్ల చరణ్, తారక్ పేర్లు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో మారుమ్రోగుతున్నాయి.తారక్, చరణ్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ ను సద్వినియోగం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.వరుస విజయాలను అందుకోవడంతో పాటు పాన్ ఇండియా హీరోలుగా చరణ్, తారక్ మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ నాలుగో వీకెండ్ లో పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?
Advertisement

తాజా వార్తలు