రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court )లో ఎదురుదెబ్బ తగిలింది.

ఈ మేరకు సీబీఐ తనను అరెస్ట్ చేయడంతో పాటు ప్రశ్నించడాన్ని ఆమె సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కవిత దాఖలు చేసిన ఈ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది.అదేవిధంగా సీబీఐ కస్టడీ పిటిషన్( CBI Custody Petition ) పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది.

ఈ క్రమంలో కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు.కవిత అరెస్టుకు రిమాండ్ రిపోర్ట్ ఆధారం అయితే అది చట్టవిరుద్ధమని న్యాయవాది పేర్కొన్నారు.

కవితను అరెస్ట్ చేయడానికి ఎటువంటి కేసు లేదన్న లాయర్ విక్రమ్ చౌదరి కస్టడీలో ఉన్న వ్యక్తిని మరో కేసులో కస్టడీలోనే ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

Advertisement

ఈ క్రమంలోనే ఇప్పుడే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.సెక్షన్ 41 దుర్వినియోగం చేశారని ఆరోపించారు.మరోవైపు కవిత( BRS MLC Kavitha )ను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది.

లిక్కర్ పాలసీ( Liquor Scam )లో కవిత సూత్రధారి అన్న సీబీఐ తీహార్ జైలు( Tihar Jail )లో ప్రశ్నించగా ఆమె సమాధానం ఇవ్వలేదని తెలిపారు.ఈ క్రమంలోనే మాగుంట రాఘవ సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం అరెస్ట్ చేశామని సీబీఐ కోర్టుకు వెల్లడించింది.

ఇరు పక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు