ప్రతిరోజు కాస్త గంజి తీసుకుంటే ఎంత మేలో తెలుసా..?

ఇప్పటి కాలంలో చాలామందికి అసలు గంజి అంటే ఏంటో కూడా తెలియదు.అదే బిర్యాని గురించి, పిజ్జా, బర్గర్ గురించి అడగండి టక్కున చెప్పేస్తారు.

కాలం మారేకొద్ది మన జీవన అలవాట్లు కూడా మారిపోతున్నాయి.మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తినడం మానేసి, అనారోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని స్వయంగా మనకు మనమే తింటున్నాము.

Gani, Amazing Benefits Of Rice Porridge, Skin Care, Hair Growth, Rice Porridge-�

రుచి గూర్చి చుసుకుంటున్నాము తప్ప ఎవ్వరు ఆరోగ్యం గూర్చి ఆలోచించటం లేదు.ఫలితంగా చిన్నవయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాము.

అప్పట్లో బియ్యాన్ని ఒక పాత్రలో ఉడికించి గంజిని వంచి తాగేవారు.ఆ తర్వాత ఆ గంజిలో కాస్త ఉప్పు, నిమ్మ రసం కలిపి తాగేసేవాళ్లు.

Advertisement

దీంతో బియ్యంలో ఉండే పోషకాలేవీ బయటకు పోకుండా శరీరానికి చక్కగా అందేవి.లేదంటే అన్నంలో అయిన పోసుకుని తినేవారు.

కానీ ఇప్పుడు దాదాపు అందరూ కుక్కర్‌ లోనే వంటలు చేస్తున్నారు.లేదంటే రైస్ కుక్కర్ లో అన్నం వండేస్తున్నారు.

లేదంటే పాత్రలో గంజిని వంచిన గాని బయట పారబోస్తున్నారు.గంజి వల్ల మనకు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే కుక్కర్ లో అన్నం వండడం మానేస్తారు.

గంజిని అన్నంలో కలుపుకుని తాగడం వల్ల కడుపు నిండుగా ఉండటమే కాకుండా శరీరాన్ని కూల్‌గా ఉంచుతుంది.గంజి మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. పైచేయి సాధించిన అమ్మాయిలు..!

స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం గంజి కలిపి స్నానం చేస్తే ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారు.గంజిలో బోలెడన్ని ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి.

Advertisement

ఎన్నో పోషక విలువలతో కూడిన గొప్ప ఆహారం అని గంజిని అనవచ్చు.గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మంచి శక్తినిస్తాయి.

నీరసంగా ఉన్నప్పుడు కాస్త గంజి తాగితే ఉత్సాహం వస్తుంది.కడుపులో మంటతో బాధపడేవారికి గంజి చాలా మంచిది.

అలాగే జీర్ణ సమస్యలతో భాద పడే వారికి గంజి తాగడం వల్ల మంచి ఉపశమనం వస్తుంది.గంజి మలబద్దకాన్ని దూరం చేస్తుంది.

వాంతులు, విరేచనాలతో బాధపడేవారు గంజిని ఆహారంగా తీసుకుంటే పోషకాలు అందుతాయి.అంతేకాదు గంజి వల్ల అందాన్ని కూడా పెంచుకోవచ్చు.

చర్మాన్ని మృదువుగా మార్చడంలో గంజి ఉపయోగపడుతుంది.మన చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది.

చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.అలాగే గంజిని తలకు పట్టిస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది.

అలాగే జుట్టు రాలే సమస్యను కూడా గంజి అరికడుతుంది.గంజిలోని అమైనో ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

తాజా వార్తలు